తిరుప్పావై ;- కొప్పరపు తాయారు
 🌻29వ,పాశురం🌻
శిత్తిమ్  శీరుకాలే వన్దున్నై చేవిత్తు, ఉన్
ప్పొత్తామరై యడియే పోత్తుమ్  పొరుళ్  
కేళాయే  పెత్తమ్మేయ్  తుణ్ణుం కలత్తిల్  పిఱచ్చనీ 
కువలెంగళై  క్కొళ్ళమల్ పోగాదు ఇత్తైఫలై
కొళ్వా నన్రుకాణీ గోవిన్ద!:ఏలైక్కుమేళేళో
నామాళ్ శెయ్  వోమ్ ముత్తిన బ్కామంగళమ్ మాత్తేలో. రెమ్బావాయ్
ఓ స్వామి! శ్రీకృష్ణా! నీ పాదారవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే లేచి, నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరివడులకు మంగళ శాసనము చేయుటే మాకు పరమావధి, ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు. ఏలన నీవు మా గొల్ల  కులం లో జన్మించి మా కులమును. మమ్ము లను ధన్యులను చేసిన వాడవు. ఓ గోవిందా!ఓ పుండరీ
కాక్షా! మేము నీ వద్దకు పఱ అను వాద్యమును పొందుటకు రాలేదు.
    అది ఒక నిమిత్తమే! వ్రతము నిమిత్తమే! మేము ఏడేడు జన్మల  వరకును మరియు ఈ కాల తత్వ ముండు వరకును, నీకు అనవార్య శేషభూతులమై నీతోడ చేరి,నీ దాస్యమును, చేయు చుండువారము కామా ! మా యందు ఇతరములైన
ఆపేక్షలేవైయున్న చో వానిని తొలగించి మమ్ము కృపజూడుము .స్వామీ ! సదా నీ సేవలను మా  కొసగుము  అని వ్రత ఫలమును ఆండాళ్ తల్లి వివరించింది. 
     🪷******🪷**ఐ***🪷

కామెంట్‌లు