భరతమాత ;- (ప్రభాకర్ రావు గుండవరం,(మిత్రాజీ) అత్వెల్లి, మేడ్చల్ )
(26th జనవరి సందర్బంగా )

🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒

జయము జయము భరతమాత
జయము నీకు దిగ్దేవతా
జయము జయము దేశమాత
జయము నీకు దిగ్విజయమూ

!! జయము జయము భరతమాత!!

వింధ్య హిమాచలములే 
కీర్తి కిరీటమయ్యే నీకు
బ్రహ్మపుత్ర సింధు గంగలు
నీ పాద తీర్థమయ్యే మాకు

!! జయము జయము భరత మాత!!

వీర శివాజికే నీవు వీర ఖడ్గమిచ్చినావు
పురుషోత్తముని పులిలాగా
అలెగ్జాండర్ ఫై పురికొల్పినావు

వీరులను కన్న మాత
ధీరులను కన్న మాత
శూరులను కన్న మాత
భరతమాత నీకు జయము
భరతావని నీకు జయము 

!! జయము జయము భరతమాత!!

జాతిపిత గాంధీజీ జవహర్లాల్ నెహ్రూజీ
నేతాజీ శాస్త్రీజీ సర్దార్జీల కన్న తల్లివి
రాజ్యాంగం నిపుణుడు అంబేద్కర్ను 
కన్న రాజ్యమాతవమ్మా

ఎందరో మహనీయులను
మరెందరో మేధావులను
ఎందరో విప్లవ వీరుల కన్న
జనని  వందనాలు!!

!! జయము జయము భరతమాత!!

మూడు రంగుల ముచ్చటైన
పతాకమే నీ రూపం
సత్యం అహింస ధర్మాలే
నీవిచ్చిన సందేశం

ఈ దేశానికి సైనికులమై 
మన రాజ్యాంగాన్ని కాపాడుతాం
జయహో భారత్ అంటూ
జయ జయ నినాదాలు చేసేస్తాం

!! జయము జయము భరతమాత!!

🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒


కామెంట్‌లు