భోజనం! అచ్యుతుని రాజ్యశ్రీ

 వంట చేయడం పాకకళ ఐతే వడ్డించడం తినడం కూడా ఓకళసుమా! ఆటవిక యుగంలో పచ్చిమాంసం పీక్కు తింటే నిప్పు కనుగొనబడింది .అంతే వండుకు వేడిగా తింటం అమల్లోకి వచ్చింది.అంతా ఒకేకుండలో వండి చుట్టూ కూర్చుని వడ్డించుకుని తినే పద్ధతి ఇస్లామిక్ దేశాల్లోమొదలైంది.ఎడారిప్రాంతాల్లో పొయ్యి సెగ పై కుండనుపెట్టి తాము సేకరించిన ఆహారంని అందులో వేసి సూప్ తయారు చేసే వారుపంజాబ్ లో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తెల్లార్తూనే బావిదగ్గర నీరుతోడి ఒక పొయ్యి పై పెనంకాల్చి చపాతీలు చేస్తారు.సాంఝ్ చూల్హా అని పిలుస్తారు.చైనాలో వంటకాల్ని బల్లపైనే ఉంచి చుట్టూ కూర్చుని తినేవారు.బఫే అంటే ఎవరికి కావలసినవి వారు వడ్డించుకుని తినే పద్ధతి యూరప్ లో ఆరంభమైంది.క్రమంగా ధనవంతుల ఇంట్లో నౌకర్లు మనకు వంటవాళ్లు వడ్డించడం ఆరంభమైంది.16 వశతాబ్దిలో స్పూన్ ఫోర్క్ చాకు కర్రపుల్లలతో తినడం ఆరంభమైంది.మన దేశంలో తామరాకు మోదుగ అరటిబాదం ఆకుల్లోతిని ఆకు బైట పడేసే వారు.కంపోస్టు ఎరువు భూమి కి సారం తయారు అయ్యేది.ఇక వెండి బంగారు స్టీల్ జర్మన్ సిల్వర్ కంచాలు వాడేవారు.దీనివల్ల ఎంగిలి కంచం ఉండదు.బైటవారికి ప్రత్యేక కంచం గ్లాసు చెంబు పెడతాం నేడు కూడా.ముందు మగవారు పిల్లలకి మడితో వడ్డించి ఆపై తినేవారు ఆడవాళ్ళు.వంటవారిని మహారాజ్ అని నార్త్ ఇండియా లో సంబోధిస్తారు.వీరికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.మతపరమైన అన్నదానం పెళ్లి లో చక్కగా పీటలు విస్తరాకుల్లో వడ్డించే పద్ధతి మన హిందూ సాంప్రదాయం.ఉప్పు నెయ్యి వడ్డించాక ఒకేసారి అందరూ చేతితో అన్నం కల్పుకుని తింటారు.ఒకేసారి ఆబంతిలో ఆఖరుగా కూచున్న వారు తినటం ముగించాక విస్తరి మడతపెడతారు.. అప్పుడు చేతులు కడుక్కోటానికి లేస్తారు.ముస్లింలు రోజా టైం లో ఉపోషం ఉండి ఖర్జూరం తింటారు సాయంత్రం.యూదులు కూడా క్రిష్టియన్ కూడా "లెంట్" రోజుల్లో గుడ్లు చేపలు తినరు.శ్రావణ కార్తీక మాసం లో హిందువులు ఉపోషం ఉంటారు.ఉల్లిపాయతినరు.శుక్రవారం పులుపు తినరు.ఆదివారం తైలమధుమాంసాలు నిషిద్ధం.కానీ కలికాలం! వద్దన్న పని చేస్తాంమనం.శివునికి పచ్చిపాలు కృష్ణునికి వెన్న అమ్మ వారికి నిమ్మకాయ పులిహోర బెల్లం పరమాన్నం పెడతాం.సంక్రాంతికి గారె అరిసె తప్పక తినాలి.ఇప్పుడు సలాడ్స్ సూప్స్ పెడ్తున్నారు.ఆఖరున స్వీట్ ఐస్క్రీమ్ ఆనవాయితీ ఐంది🌹
కామెంట్‌లు