అటవెలది పద్యాలు;- ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా
-------------------------------------------------------------
మూడు రంగులున్న మువ్వన్నె జెండాలు
ఎర్రకోటనుండి యెగిరి గగన
మంత తిరిగి పల్లెలంత నింపే కీర్తి
భావిపౌరులార బాలలార

దేశభక్తి తోడ దేశరక్షణ కయి
పోరునంత సల్పి భుజబలాన
ముష్కరులను తరిమి మురిసె వీరజవాను
భావిపౌరులార బాలలార

శాంతి,సత్య,ధర్మ సహనములను తెల్ప
జగతినంత చదివి చర్చపెట్టి
కదిలి నడిచినాడు కలమునాంబేద్కరు
భావిపౌరులార బాలలార


భారతావనినందు భవ్య చరితనొంద
రచన చేసినారు రాజసమున
గ్రంథమొచ్చినుచ ఘనమునైరావత
భావిపౌరులార బాలలార


గడప గడపనందు గణతంత్ర పర్వంబు
ప్రజల దేశభక్తి పరిడవిల్లు
తిరిగినంత చోటు త్రివర్ణ శోభలు
భావిపౌరులార బాలలార
కామెంట్‌లు