చందమామ చందమామ రావమ్మ
మా అందాల పాపాయి పిలుస్తుంది
కుందనాల బొమ్మకు పెళ్లి చేస్తుంది
బంధువుగా నీవిటు రావమ్మా !!
నిండు పున్నమి నేడమ్మ
కొండలు కోనలు దాటుతూ
సముద్ర అలలతో ఆడుతూ
ముద్దు ముద్దుగా నీవు రావమ్మ !!
పిండిలాపరిచిన వెలుగులలో
పెండ్లి మండపం చూడమ్మా
తారలను అక్షంతలుగా చల్లి
పిల్లలకు చల్లని దీవెనలియమ్మ !!
మేఘాల పైన తేలుతూ
పిల్లలు అందరూ వస్తారు
మల్లెల మాలలు తెస్తారు
మెల్లగా నీ మెడలో వేస్తారు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి