సౌందర్యలహరి ; - కొప్పరపు తాయారు
🌻శ్రీ శంకరాచార్య విరచిత 🌻 

నరంవర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం
తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః ।
గలద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయా
హఠాత్ త్రుట్యత్కాంచ్యో విగలితదుకూలా యువతయః ॥ 13 ॥

క్షితౌ షట్పంచాశద్ ద్విసమధికపంచాశదుదకే
హుతాశే ద్వాషష్టిశ్చతురధికపంచాశదనిలే ।
దివి ద్విష్షట్త్రింశన్మనసి చ చతుష్షష్టిరితి యే
మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగమ్ ॥ 14 ॥

13) అమ్మ!  విచిత్రము! అందవిహీనుడు ముసలి 
వాడు చింపిరి జుట్టు కలిగిన మూర్ఖుడు జీవితం మీద అనువృత్తి లేని వారిపై నీ కృప వీక్షణాలు పడితే మంచి వయసులో ఉన్న స్త్రీలు అతను రూపవంతుడగట,వలన, అందగత్తెలు యువతులు
ప్రేమానురక్తితో , తమ అందాలు ఉప్పొంగా మన్మధ ఆవేశంతో అతని వెంట పడతారు. అమ్మా! నీ దయార్ద్ర దృష్టికి పడితే  అంతటి శక్తి ఉంది.
       అంటే అమ్మా! నీ కృపా వీక్షణాలు ఎంతటి నీచ స్థితిలో ఉన్నా వారి వారికి నీ ప్రేమాభిమానాలు పంచి ఆశీర్వదిస్తావని తెలియు చున్నది తల్లీ !
        
14) తల్లీ ! జగన్మాతా! పృధ్వీ(భూమి) ఉదకము (జలము)నందు, అనిలుడు(అగ్ని) యందు, దివి (ఆకాశము)యందు, మనసు నందు, నీ చరణ కమలములు వెలుగొందుచున్నవి. షట్చక్రాలలో వీటి పైన గల సహస్ర దళముల మధ్యన అమృతజలధియగు సహస్రారములో నీ పాదయుగము ప్రకాశించుచున్నది..!
  ****🪷***
   తాయారు 🪷

కామెంట్‌లు