సంక్రాంతి పర్వదినం; - సాహితీసింధు, పద్యగుణవతి సరళగున్నాల
కం*ముంగిళ్ళ ముగ్గులెన్నయొ
సింగారపు నింతులంత సిరులొనగూరన్
చింగులు లోనికిదోపుచు
నింగిన హరివిల్లులిలకు నేలకు దింపున్

సీ*ముంగిళ్ళలోనెన్ని ముత్యాలముగ్గులు
గడపల పసుపులన్ కలియ బూసి
సెనగకుసుమదంట్లు చెరుకుముక్కలనిన్ని
రేగుపళ్ళగలిపి రెల్లుగడ్డి
వాకిళ్ళ బెట్టుచున్ పాలుపొంగగజేసి
పాయసాన్నమువండు వనితలింట
కుడుములు, సకినాలు  తడువింతగొనకుండ
మురుకులు చేగోళ్ళు మురిపెమలర
పసుపుకుంకుమనోమి వనితలందరకీయ
దీవెనలందించు దేవతలును

భోగి భోగమ్ములందించు పుడమిలోన
సంకురాత్రిన యెన్నెన్నొ సంబరాలు
కనుమ జూపించు క్రాంతుల కాగడమ్ము
జరుపుకొనవలె భువిలోన జనులునెపుడు

కామెంట్‌లు