తిరుప్పావై ; - వరలక్ష్మి యనమండ్ర.
20 వ పాశురం -
***********
ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్హు కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెళాయ్; శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు వెప్పబొడుక్కుమ్ విమలా! తుయిలెళాయ్; శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిఱు మరుడ్గుల్ నప్పిన్నై నజ్గాయ్! తిరువే! తుయిలెళాయ్; ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై ఇప్పోతే యెమ్మై నీరా ట్టేలో రెమ్బావాయ్
***********
20వ పాశురము--భావము
***********
ముప్పది మూడు కోట్ల ప్రజలను కాపాడే దేవా
నీపై భక్తితొ నిను కీర్తించుటకొచ్చితిమో దేవా
నీ భక్తుల మొరలు వినుటకు రావేలా ఓ దేవా
మా మొర విని మము కనికరించవదేలా ఓదేవా
బంధనాలను దాటి వస్తిమి మేము కరుణించము ...కృష్ణా

మాపై నీకు దయకలుగదా రావేలా ఓ స్వామీ
నిర్మల మనసుతో నిను కొలిచెదము రావేల స్వామీ
అహంకారపు పొర తొలగి జ్ఞానము కల్గెను స్వామీ
ఆత్మ జ్ఞానామృతమును మాకొసంగుమూ ఓ స్వామీ
నీ గుణగానము నిత్యము చేయు చుంటిమీ ఓ స్వామీ.. కృష్ణా

సన్నని నడుము కలిగిన దానవు నీలమ్మా
స్వామికి సేవలు చేయుటకొస్తిమి ఓ నీలమ్మా
మాకు వీవెనలు, దర్పణమీయుము నీలమ్మా
స్వామిని నీవు నిద్దుర లేపుము ఓ నీలమ్మా
స్నాన వ్రతమును చేయగా వస్తిమి నీలమ్మా...కృష్ణా

(ఈ విధముగా గోదా దేవి ,తన సఖులు కృష్ణ స్వామి దర్శనం  కొరకు ఈ మార్గశిర మాసమంతయూ వారి భక్తిని చూపుతున్నారు.)
**********


కామెంట్‌లు