ధర్మరాజు.. మర్యాద! అచ్యుతుని రాజ్యశ్రీ

 మహాభారతం లో పాండవుల్లో పెద్ద వాడు ధర్మరాజు.మంచియుద్ధశౌర్యపరాక్రమవంతుడు.కానీ ధర్మంలో ఆయన్ని మించిన వారు లేరు.రాజసూయయాగంచేస్తూ దానికి రావాల్సినదిగా అందరికీ ఆహ్వానం పంపాడు.కౌరవుల దుర్బుద్ధి అసూయ తెల్సినా నకులుని పంపాడు ఆహ్వానించి రమ్మని.ఇకయాగానికి వచ్చిన మిత్రులు శత్రువులు అన్ని భేదం లేకుండా అందరికీ తలా ఒక బాధ్యత అప్పగించారు. మన కురువంశంకి సంబంధించిన యాగం.మనమంతా ఒక్కటే అనే సమదృష్టి తో అసూయ తో రగుల్తున్న దుర్యోధనుడికిఏంపని అప్పగించాడో తెలుసా? వివిధ దేశాల రాజులు ఇచ్చే కానుకలను బాధ్యత గా అందుకునే పెత్తనం ఇచ్చాడు.బంగారం వెండి వజ్రాల..ఇలా ఆకానుకల్ని  విరామం లేకుండా తీసుకుని చేతులు నెప్పిపెట్టి అలసికూలబడ్డాడు . తండ్రి తో అదే మాట చెప్పాడు.ఆహారం వినిమయం వ్యవహారం దుశ్శాసనుడికి ఇచ్చాడు.దానధర్మాలు దక్షిణ ఇచ్చే బాధ్యత అధికారం కృపాచార్యుడికి ఇచ్చాడు.ఇక ఏపని చేయాలో వద్దో నిర్ణయం తీసుకోమని భీష్మద్రోణులని వేడుకున్నాడు.ఒకరు తాత ఒకరు గురువు.అన్నిపదార్దాల సద్వినియోగం ధర్మాత్ముడు ఐన విదురుని కి అప్పగించాడు.అగ్రపూజ పరమాత్మ కృష్ణునికి చేశాడు.ఇక రాజసూయం ముగిశాక బంధుమిత్రులు అందరికీ సముచితంగా సన్మానం చేసి ఎంతబాగా వారిని సాగనంపాడో చూడండి.మనం బంధువులు స్నేహితులు వస్తే వారిని ఇంటి బైటికి వచ్చి వీడ్కోలు పలుకుతాం. అలా ధర్మరాజు భీముడితో" నీవు సకలమర్యాదలతో భీష్మ ధృతరాష్ట్రుడుని రథంలో సాగనంపు." అన్నాడు.అర్జునుడు ద్రుపదుని 
నకులుడు కర్ణుని సైంధవుడు శల్యుని సాగనంపారు.సహదేవుడు కృప అశ్వత్థామల్ని గౌరవంగా వీడ్కోలు పలికాడు.పంచపాండవులు కృష్ణ పరమాత్మను భక్తితో రథం ఎక్కించారు.అభిమన్యుడు ఉపపాండవులు పర్వతరాజుల్ని రథాలెక్కించారు. దుర్యోధనుడు శకుని " మేము రెండు రోజులుండి మయసభ చూసి వెల్తాం" అన్నారు.అంతా ముగిసిన తర్వాత వ్యాసభారతంలో ఇలా ఉంది.వ్యాసుడు నారదుడు ధర్మ రాజుని హెచ్చరించారు" యుద్ధాలు వస్తాయి.ఉత్పాతాలు రక్తపాతాలు బంధుక్షయం జరిగితీరుతుంది. అధర్మం అడుగంటా నామరూపాలు లేకుండా పోవాలి." అందుకే తగాదాలు కొట్లాటలు రాకూడదు అని ధర్మరాజు సోదరులు రాజులు కౌరవులతో ఎలాంటి విరోధం లేకుండా మౌనంగా అవమానాలు భరించాడు.అంతటి ధద్మమూర్తి సహనశీలి నభూతో నభవిష్యతి.కుటుంబంలో అన్నగా బాధ్యతలు పెద్ద కొడుకు గా తల్లి ని ప్రేమ ఆప్యాయత అనురాగం తో చూసిన ధర్మరాజు కథ అందరూ తెలుసుకోవాలి.కథ కాదు జీవితం.🌷
కామెంట్‌లు