తిరుప్పావై ;- కొప్పరపు తాయారు
   🌻24వ, పాశురం 🌻
అన్రివ్వులగ  మళన్దాయ్ ! ఆడిపోట్రి చ్చెనద్గు,త్తెన్నిలజ్జె శెత్తాయి ! తిఱల్ , పోట్రి పోనచ్చెగడ 
 ము దైత్తైయ !పుగళ్ పోట్రి కున్రు కుణిలా వెఱిన్దాయ్ !
కళల్ పోట్రి కున్రు కుడైయావెడుత్తాయ్ ! గుణమ్ పోట్రి పడుకు ని కైయిల్  వేల్ పోట్రి ఏన్రున్ 
శేవగమే యేత్తిప్ప లై కొళ్వాన్  ఇన్నియామ్  ‌వన్దోమ్
ఇరట్లేలో  రెమ్బావాయ్
అలనాడు బలి వలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా! సీతమ్మను అపహరించిన దుష్టుడగు రావణుని లంకను గెలిచిన శ్రీరామా !
నీ ధీరతకు మంగళము! బండి రూపంలో శకటాసురుడనే  రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి
ప్రభలకును మంగళము! దూడ రూపమున నిన్ను
చంప వచ్చిన వత్సాసురుడనే  రాక్షసుని వెలగ చెట్టుగా దారి ప్రక్కన నిలిచిన కపితాసురుడనే రాక్షసిని ఒక్కసారిగా సంహరించిన నీవంచిన పాదమునకు మంగళం!
             దేవేంద్రుడు రాళ్ల వర్షమును గోవర్ధనగిరిని గొడుగు గా నెత్తి గోకులంను రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకు మంగళమగు గాక! శత్రువులను  చీల్చి చెండాడు నటి నీ చేతి చక్రము నకు మంగళము!
మంగళము ఇట్లు నీ వీర గాగల నెన్నింటినో నోరారా
స్తుతించును నీ నుండి మా నోమునకు కావలసిన పరికరములను పొందుటకై మేము నేడు ఇచ్చుటకు వచ్చి ఉన్నాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము అని గోపిక లెల్లరు స్వామిని వేడుకొన్నా🪷****🪷*****🪷

కామెంట్‌లు