తెలుసుకుందాం! అచ్యుతుని రాజ్యశ్రీ

 కుమారీ కందం అనే ప్రాంతం ఒకానొకప్పుడు భారత దేశంకి దక్షిణంగా హిందూ మహాసముద్రం లో ఉన్న ప్రాంతం.అది తమిళ సంస్కృతి సంప్రదాయాలనిలయంగా ఉన్న ప్రాంతం అని 19వ శతాబ్దంలో విదేశీయులు కనుగొన్నారు.ఆఫ్రికా భారత్ మెడగాస్కర్ ప్రాంతాల్లో పరిశోధన చేశారు.సముద్రంలో మునిగి పోయిన ఆమహాద్వీపంని  లెమూరియా అన్నారు.ఇంకో ద్వీపం కి " ము" అని పేరు పెట్టారు.మంచుకొండలు కరిగి ప్రవహించడంతో అవి మునిగి పోయాయి.ఆరెండు ద్వీపాలు మానవనాగరికత తో విలసిల్లాయి అని శాస్త్రవేత్తల అభిప్రాయం.తమిళ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం" ము_ద్వీపం" పేరు కుమారీ కందమ్! దీన్ని కుమారీ కాంతమ్ కుమారీ నాడు అని పిలిచే వారు.తమిళ సంస్కృత సాహిత్యం వల్ల ఈప్రాంతం పాండ్యన్ వంశంకిచెందినది అని తెలుస్తోంది.ఆవంశపాలకుల గూర్చిన వివరాలు జానపదగీతాల్లో కథల్లో ఆధారాలుగా మిగిలాయి.ఇవి కాల్పనికంకాదని నిర్ధారణ అయింది.మానవనాగరికత ఆఫ్రికా లో మొదలైంది.కానీ పరిశోధనలో తేలిన అంశం ఏమిటంటే మన దేశంకి చెందిన కుమారీకందమ్ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలనిలయం అని. 1864 లో ఫిలిప్ కాల్టన్ పరిశోధనచేసి రాసిన పుస్తకం లో చాలా విషయాలు ప్రపంచం కి వెలుగులు పంచాయి.
ఇక కుమారీ కందమ్ కన్యాకుమారి నుండి ఆస్ట్రేలియా మెడగాస్కర్ వరకు విస్తరించిన భూప్రాంతం.ప్రస్తుతం ఉన్న మన భారతదేశం కన్నా 3_4 రెట్లు పెద్దది!? భారత్ చేసిన పరిశోధన కూడా ఇది సముద్రంలో మునిగిపోయిందని తేల్చి చెప్పింది.శ్రీలంక కూడా అలా విడిపోయిన ప్రాంతమే.ఇక లెమూరియా ద్వీపం గురించి కాల్టన్ రాసిన విషయాలు ఏమంటే అక్కడి ప్రజలు చాలా పొడుగ్గా ఉండేవారు అని.15 వేల ఏళ్ల క్రితం దాకా ఉన్న ఆప్రాంతం మంచుకరిగి నీరుగా మారి సముద్ర గర్భంలో విలీనమైంది.అలా కుమారీ కందమ్ కనుమరుగైంది శాశ్వతంగా 🌹
కామెంట్‌లు