వేదం రాజ్యాంగం!!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
పార్లమెంటు శిఖరంపై
ఎగురుతున్న జాతీయ జెండా
జాతి గుండెకాయ!!;

ఇప్పుడు ఎగురుతున్న రాజ్యాంగం
ఎదుగుతున్న రాజ్యం!!!

రాష్ట్రపతి ఎత్తిన శిరస్సే
ఆకాశమంత రెపరెపలాడే
పబ్లిక్ రిపబ్లిక్ !!!!!!!

రాష్ట్రపతి అభివాదం !!
రాజ్యాంగమే ఆదివేదం!!!

పొలంలో విత్తులు మొలకెత్తినట్లు
వ్యక్తుల గుండెల్లో
రంగురంగుల పూలదండల్లా
జెండాలు మొలుస్తున్నవీ!!!!!!

రాజ్యాంగం ఇప్పుడు
సూర్యచంద్రుల్లా-ఇంద్రధనస్సుల్లా
మళ్లీ మళ్లీ పూస్తుంది!!!!

బుద్ధుని భూమి మాది!
కృష్ణుని గీత ధాటం మేం!!
రాముని దర్మం వీడం!!
ప్రవక్తలు దూతలే మా దాతలు!!!

ఆకులు రాలి పూలు పూసినట్లు
ఋతువులు మారి చెట్లు చిగుర్చినట్లు
భారతీయుల బ్రతుకులు మారుతున్నవి
నాణ్యమైన నైపుణ్యమైన జీవితాలు
నాణ్యానికి
బొమ్మ బొరుసుల్లా నిలుస్తున్నవీ !!!!!?

విశ్వ గురువు గూగుల్ కావచ్చు కానీ
రాష్ట్రానికి రాష్ట్రపతిలా
రాజ్యాంగమే మాకు విశ్వ గురువు!!!

జ్ఞానం శాస్త్ర విజ్ఞానమే మా ప్రతిజ్ఞ !!
విద్యా వైద్యం ఆరోగ్యానికి మేమే ఆదర్శం!!

బాధల్లో
వర్షం కురిసిన మేఘాలం మేం
విజయ గాధల్లో
విశాల మైదానాలం మేం

రాష్ట్రపతి అభివాదం రాజ్యాంగమే ఆదివేదం!!!!

జైహింద్
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు