చిరంజీవ బాలికా... చిరంజీవ; - కోరాడ నరసింహా రావు!
అణు వై... ఒ ది గి యున్న... 
మహా విష్పోటన శక్తి...! 
 అబల లా కనిపించే ఆది శక్తి!! 
  
అమ్మ యై కని పెంచే... 
    మాతృ హృదయం ! 
 తోబుట్టు వై...ఆప్యాయ తానురాగా లను పంచే.... 
   అభిమాన ధన0  ! 
 
అన్ని విధాాల అణగ ద్రొక్కినా
   ద్వేషాన్నిపెంచుకోక... ప్రేమనే పంచే అమృత హృ ద యి...! 
 
ఆమె మనసు ఆకాశ0... 
  ఆమె హృ దయం అగాధ0
 ఓర్మి లో భూదేవి..!
   కూర్మి లో శ్రీ దేవి.!! 

విద్యలకు సరస్వతి... 
  సాహసం లో  పా ర్వ తి! 
 ఆమె ఇలపై వెలసిన. 
  ప్రత్యక్ష దైవము...! 

ఆమె చిట్టి పాప యై... 
  నట్టింట నడయాడితే... 
   విరిసిన పువ్వు లాంటి... 
   ఆ బోసి నవ్వులు చి లు క కరిస్తే. 
   ఆ ఇల్లే. స్వర్గం...!! 

వివక్ష వద్దు... 
 సమానత్వమే ముద్దు! 
 నేటి బాలిక లే... 
 రేపటి కుటుంబ పాలికలు
  మహిళ విద్యా వంతు రాలైతే
   కుటుంబము... త ద్వా రా
   సమాజమూ వికాశ వంతము

బాలికా భ్యున్నతియే... 
 దేశ  అభ్యున్నతి...!! 
 చిరంజీవ  బాలికా... 
   చిరంజీవ... చిరంజీవ
     ******

కామెంట్‌లు