పాట;- వరలక్ష్మి యనమండ్ర
ముప్పది పాశురములు ముత్యపు సరములు
మురళీ ధరునకు ముచ్చటగా వేయుటకు
ముదితలు ముదముతో రారండీ రారండీ!!ము!!

పాలకడలిని మథింపజేసిన
విష్ఢు భజనలను చేయండీ
ఉల్లములలరగ అల్లన పాటలు
పాడి చేయించెను గోదాదేవి !!పా!!ము!!

ముప్పది దినములు మురిపెము మీరగ
కీర్తించిరిగా గోప వనితలు
విష్ణు పదమునే శరణని నమ్మీ
స్నాన వ్రతమును చేసిరిగా!!ము!!ము!!

కృష్ణాష్ణోత్తరములను, గోదాష్టోత్తర
శతనామములను చేయండీ!!కృ!!
కృష్ణుని నమ్మి నితైయము కొలిచీ
నిలువుము భక్తుల వరుసలలో!! కృ!!ము!!
**********


కామెంట్‌లు