ఓటు విలువ ; -వరలక్ష్మి యపమండ్ర
(ఓటర్ల దినోత్సవం సందర్భంగా)
***********
ప్రజాస్వామ్యపు మంత్రము
ఓటుహక్కు మన సూత్రము
ఓటేయడం మన ఇష్టము
నాయుకుడిని ఎన్నకోడము 
అదే నిజమైన ప్రజాస్వామ్యము ... లక్ష్మీ

ఓటుహక్కు వచ్చు పద్దెనిదేళ్ళకి
ఓటే పునాది బంగారు భవితకి
ఏనాడు అమ్ముడుపోకు నోటుకి
గొడ్డలిపెట్టది ప్రజా స్వామ్యానికి
ఓటువిలువ తెలుసుకో ఓటరూ....లక్షీ 

ప్రతి ఐదేళ్ళకు ఓట్ల పండుగ
వెయ్యాలి ఓటు తప్పకుండగ
బూత్ అడ్రస్ తెలుసుకోవాలిగా
లేకుంటే పడతావు ఇబ్బందేగ
ఓటువిలువ తెలుసుకో ఓటరూ... లక్ష్మీ

ఇంటింటికి తెరిగేరు నాయకులు
పంచుతారు వారు తాయిలాలు
ప్రజలకు మేలుచేయు ఎన్నికలు
తొక్కరాదు ఓటుక్ అడ్డదారులు
ఓటువిలువ తెలుసుకో ఓటరూ... లక్ష్మీ

ప్రజాస్వామ్యానికి ఆయువిది
ఓట్లను అమ్ముకోవడం చెడ్డది
దేశ చరిత్రను మారుస్తుందిది
రెండక్షరాల ఆయుధముఇది
326 ఆర్టికల్ ఓటుహక్కుఇచ్చె... లక్ష్మీ

ప్రలోభములకు లొంగకు
కులం మతం అనుకోకు
ఓటేగదా అని బద్ధకించకు
ఇంటికొచ్చాడని జైకొట్టకు
ఓటు విలువ నీవు తెలుసుకో... లక్ష్మీ

ఓటరుకు ఓటు వజ్రాయుధము
ప్రతి పౌరునికి ఓటు కీలకము
ఓటు హక్కు పౌరుని అస్తిత్వము
డబ్బుకాదు  మనకి ప్రథానము
మన భవిష్యత్తు ఉండాలి మంచిగ... లక్ష్మీ

జాతీయ ఓటర్ల దినోత్సవము 
జనవరి 25న జరుపుతాము
అధికారులిచ్చుఅహగాహనము
మనకు అదెంతో ఉపయోగము
ఓటువిలువ తెలుసుకో ఓటరూ... లక్ష్మీ

మంచి నాయకుణ్ణి ఎన్నుకోవాలి
సమాజ శ్రేస్సును కోరుకోవాలి
రాజ్యాంగానికి విలువనివ్వాలి
దేశ భవితకదే ఆదర్శంకావాలి
ఓటువిలువ తెలుసుకో ఓటరూ... లక్ష్మీ

ఎడమచేతి చూపుడు వేలిపైరా
ఓటు వేశామను చిహ్నమురా
ఇండిలబుల్ ఇంక్ తో పెట్టేరురా
మరలమరల ఓటుకి రాకుండారా
విషయం తెలుసుకో ఓటరూ.... లక్ష్మీ

కామెంట్‌లు