వైజాగ్ బీచ్( బాల గేయం)- ----ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
వైజాగ్ లో బీచ్ చూడండి
చిన్న పెద్ద అలలండి
అలజడి చేస్తూ వస్తున్నాయి
అందమైన బీచ్ చూడండి!!

పిల్లలు పెద్దలు అందరూ
అలలపై ఆడుతు పాడుతు
నీటిలోనా గెంతులు వేస్తూ
ఎంతో హాయిగా ఉన్నారండి!!

మనసుకది ఎంతో ఆనందం 
పిల్లల పెద్దల కేరింతలతో
వీణులకెంతో ఇంపుగా ఉంది
ఎంతో అందమైన బీచండదీ!!

పిల్లలు పెద్దలంతా వినరండి 
అందరు కలిసి ఆనందంగా
వైజాగ్ బీచ్ కి వచ్చేసి  
నీటి అలలతో ఆటలాడండి !!


కామెంట్‌లు