టీ పాట్! అచ్యుతుని రాజ్యశ్రీ

 చాయ్ అందరం తాగుతాం. మనం కాచి వెంట వెంటనే గ్లాస్ కప్పుల్లో పోసుకుని తాగుతాం.మరి గొప్పవారు అతిథులు వచ్చినపుడు టీపాట్ లో నింపి ఖాళీ కప్పులు సాసర్లు ట్రేలో పెట్టి తెస్తారు.ఇవన్నీ పింగాణీ వస్తువులు.ఇప్పుడు పేపర్ కప్పు ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్నాం.ఈటీపాట్ వెల ఎంతో తెలుసా? గిన్నీస్ బుక్ లో ఎక్కింది.లండన్ కంపెనీల తయారీలో 18 కేరెట్ల బంగారం తో తయారైంది.దీని చుట్టూ వజ్రాలు పొదగబడినాయి.మధ్యలో 6.67 కారెట్ మాణిక్యం సూర్యునిలా వెలుగులు చిమ్ముతుంది.1658 వజ్రాలు 386 అసలుసిసలు థాయ్ బర్మా మాణిక్యాలు పొదిగారు.ఈ టీపాట్ కి ఓపేరు కూడా ఉందండోయ్!"ది ఇగోయిస్ట్" దీని ఖరీదు 3 మిలియన్ల డాలర్లు.మన కరెన్సీ లో 24 కోట్లు.ప్రపంచంలోనే అరుదైన అపురూప టీపాట్ ఇది! దీన్ని తయారు చేసిన వాడు ఇటాలియన్ నగలతయారీవ్యక్తి ఫుల్వియోస్కైవియా..దీని హాండిల్ ని ఏనుగు దంతంతో చేశారు.బంగారం వెండిపూతల ధగధగలు వజ్రాల తళతళలు! 
దీని గురించి కామెంట్స్ ఇలా వచ్చాయి" దీన్ని నేను దొంగిలిస్తాను. " మట్టి పాత్రలో చాయ్ వజ్రాల టీపాట్ లో చాయ్ రుచి ఒకేలా ఉంటుంది కదా? " నిజమే! గొప్ప వారు బీదవారు అన్నం పాలు పెరుగు నెయ్యి పప్పు తినేది ఒకటే కదా? బంగారం తినరు కదా?
కామెంట్‌లు