నేను అచేతనంగా పడి పోయిన క్షణం
ఆలోచన తానై
నన్ను వెన్ను తట్టి లేపి కూర్చోబెట్టేది
నా కవిత ఒక్కటే!!!
నేను నైరాశ్యంలో
కూరుకుపోయినప్పుడు
నన్ను నన్నుగా గుర్తించి
నా గుండె లోతుల్ని తట్టి
తాను నా ఆశయై-నా ఆనందమయ్యేది
నా కవిత ఒక్కటే!!!!!
నేను దుఃఖ సాగరంలో ఉన్న వేళ
తాను నావయై
నా జీవిత పయనంలో గమ్యానికి
చేర్చేది నా కవిత ఒక్కటే!!!
మానసిక ప్రశాంతత కోల్పోయిన వేళ
ఏం చేయాలో అర్థం కాని సమయంలో
మార్గదర్శకమై-స్నేహమై
నా పక్కన నిలిచేది-నా కవిత ఒక్కటే!!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి