పాప జీవితం ;- కొమ్మూరి వరలక్ష్మి, -పదవ తరగతి బి,-ప్ర. ఉ. పా . రాజభవన్, - సోమాజిగూడ,-హైదరాబాద్.
నాకు తల్లిదండ్రులు ఉన్నా
 నేను వీధి చెత్తలో ఉన్న
 నేను అవిటిదానిగా పుట్టడం నేను చేసిన తప్పా! 
అలా అనడం ఎక్కడి విచిత్రం!
 ఏమిటి ఈ జీవితం !
నాకు అమ్మానాన్న ఉన్నా
నేను ఒంటరిగానే ఉన్న 

నేను పుట్టిన వెంటనే అందాలు చూస్తా అని కలలు కన్నా
కానీ పుట్టిన తర్వాత అంధకారమైన జీవితం కంటున్నా
ఆకలి వేస్తోంది
 చలి వేస్తుంది 
చీమలు  కుట్టి రక్తం కారుతోంది
నాకు అమ్మానాన్న ఉన్నా
నేను ఒంటరిగానే ఉన్న

అవును నేను ఏ తప్పు చేశాను ?
నేను ఇంకా ఎందుకు మిగిలి ఉన్నాను ?
 నాకెందుకు ఈ శిక్ష ?
ముక్కంటిశ్వరుడా నువ్వే నాకు రక్ష. 
నాకు అమ్మానాన్న ఉన్నా
నేను ఒంటరిగానే ఉన్న

కామెంట్‌లు