గల్లగురిగికి సలాం!
నా పసితనాన
అమ్మా నాయినా ఇచ్చిన
ఒక్కొక్క రూపాయీ
గల్లగురిగి బొత్తల యేసేది!
తాతా, అమ్మమ్మా
కొనుక్కోమని యిస్తే
వాటిని కూడా
గల్లగురిగి కడుపుల యేసేది!
మామా, అత్తా,
పెద్దనాయినా,పెద్దమ్మా
యేవూరికన్నా పోయినప్పుడో
వూరినుండి వచ్చినప్పుడో
“యేదన్నా కొనుక్కోరా!”
అంటూ యిచ్చిన ప్రతిపైసా
గల్లగురిగి పరం జేసేది!
కడుపు గట్టుకోని
కాలు గట్టుకోని
గల్లగురిగి బరువు పెంచేటోన్ని!
అప్పుడప్పుడు
గల్లగురిగిని దీసి చూస్కోని
“దేవుడా! దేవుడా!!
నా గల్లగురిగి దబ్బున నిండని దేవుడా!!" అని
దేవుని పటం జూసి మొక్కేటోన్ని!
నేను తరచూ దాన్ని దీసి చూస్తుంటే
మా అమ్మ
“అరేయ్! పలగ్గొడుతవ్ రా!” అనేది!
ఒకసారైతే
నా గల్లగురిగిని
సామానర్రల న్యాలదొవ్వి
పాతింది మా అమ్మ
అండ్ల పైసలేసేతందుకు
మూతి దెరవెట్టింది సుమా!
అప్పటి గల్లగురుగులకు
మట్టిరంగే ఉండేది
మరి, ఇప్పటి గల్లగురుగులకు
ఎన్నో రంగులు
చూడ సంబురంగా!
కాని...,
నా పైసల్ని, నా కలల్ని
తన కడుపులో దాచుకున్న
నా చిన్నప్పటి గల్లగురిగి
ఇప్పటికీ నా మదిలో
ఒక తీయని జ్ఞాపకం
అందుకే....
గల్లగురిగికి సలాం!!
**************************************
నా పసితనాన
అమ్మా నాయినా ఇచ్చిన
ఒక్కొక్క రూపాయీ
గల్లగురిగి బొత్తల యేసేది!
తాతా, అమ్మమ్మా
కొనుక్కోమని యిస్తే
వాటిని కూడా
గల్లగురిగి కడుపుల యేసేది!
మామా, అత్తా,
పెద్దనాయినా,పెద్దమ్మా
యేవూరికన్నా పోయినప్పుడో
వూరినుండి వచ్చినప్పుడో
“యేదన్నా కొనుక్కోరా!”
అంటూ యిచ్చిన ప్రతిపైసా
గల్లగురిగి పరం జేసేది!
కడుపు గట్టుకోని
కాలు గట్టుకోని
గల్లగురిగి బరువు పెంచేటోన్ని!
అప్పుడప్పుడు
గల్లగురిగిని దీసి చూస్కోని
“దేవుడా! దేవుడా!!
నా గల్లగురిగి దబ్బున నిండని దేవుడా!!" అని
దేవుని పటం జూసి మొక్కేటోన్ని!
నేను తరచూ దాన్ని దీసి చూస్తుంటే
మా అమ్మ
“అరేయ్! పలగ్గొడుతవ్ రా!” అనేది!
ఒకసారైతే
నా గల్లగురిగిని
సామానర్రల న్యాలదొవ్వి
పాతింది మా అమ్మ
అండ్ల పైసలేసేతందుకు
మూతి దెరవెట్టింది సుమా!
అప్పటి గల్లగురుగులకు
మట్టిరంగే ఉండేది
మరి, ఇప్పటి గల్లగురుగులకు
ఎన్నో రంగులు
చూడ సంబురంగా!
కాని...,
నా పైసల్ని, నా కలల్ని
తన కడుపులో దాచుకున్న
నా చిన్నప్పటి గల్లగురిగి
ఇప్పటికీ నా మదిలో
ఒక తీయని జ్ఞాపకం
అందుకే....
గల్లగురిగికి సలాం!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి