సౌందర్యలహరి ; కొప్పరపు తాయారు
   🌻 శ్రీ శంకరాచార్య విరచిత🌻
కిరీటం వైరించం పరిహర పురః కైటభభిదః
కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారిముకుటమ్ ।
ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే ॥ 29 ॥
స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితో
నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః ।
కిమాశ్చర్యం తస్య త్రినయనసమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్నిర్విరచయతి నిరాజనవిధిమ్ ॥ 30 ॥
29)
  ఓ జగన్మాతా! భవానీ! త్రిపుర  సంహారం చేసి 
విజయండై కైలాసంలో  నీ భవనమునకు తిరిగి వస్తున్న  నీ భర్తయగు పరమశివుని  యొక్క విజయాగమన వార్త విని నీవు అత్యంత సంతోషంతో నీ సింహాసనం నుండి లేచి గబగబా  నడుచుచూ స్వాగతం పలుకుటకు గాను వస్తుండగా , అంతవరకు నీ పాదపీఠము వద్ద శిరస్సులు వంచి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తున్న బ్రహ్మ విష్ణు ఇంద్రుల కిరీటములు మీ పాదములకు తగిలి వారి కిరీటముల వరిపిడికి నీ మృదుపాదములు గాయపడునేమో నని భయపడి నీ పరిచారికలు అమ్మా !జాగ్రత్త !జాగ్రత్త! అనుచు హెచ్చరికలు చేయుచున్నారు.
30)
ఆద్యంతాలు లేని దానవని లోకములచే తల్లీ!
నీ శరీరం నుండి వచ్చు కిరణాలు అణిమాది  సిద్దుల ఆవరింపబడిన నిన్ను ఏ సాదికుడు ధ్యానిస్తున్న, ఈశ్వరుడు, సంపదలు కూడా తృణముగా  చూచే ,ఆ సాధకునికి ప్రళయాగ్ని సహితం నీరాజనం పట్టడం అతిశయోక్తి కాదు కదా!
.                    ****🪷****
తాయారు 🪷

కామెంట్‌లు