మంచి పనులు- సి.హెచ్.ప్రతాప్
 విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ చిన్నప్పుడు కాకరకాయ, పెద్దయ్యాక కీకరకాయ అన్న చందాన మన మూలాలను, జీవన విలువలను మరిచిపోతున్నాము. పాశ్చాత్య నాగరికత మోజులో కొట్టుకుపోతూ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పక్కన పడేస్తున్నాము. అందుకే మన పూర్వీకులు మనకు అందించిన కొన్న అపురూప జీవిత సత్యాలను తిరిగి మననం చేసుకునే ప్రయత్నమే ఈ చిన్న వ్యాసం.
1. అన్ని జీవములను నీవలనే భావించండి.
2. ఆకలి గొన్నవానికే అన్నం పెట్టండి.
3. ఈడు వచ్చిన కొడుకును జోడుగా చూడండి.
4. పరుల సొత్తు మట్టిపెళ్ళగా ఎంచండి.
5. పిల్లవారి నుండి కూడ హితవు వినే సంస్క్రారం అలవరచుకోవాలి.
6. ప్రాణముకన్న  మానము ఎక్కువగా ఎంచండి.
7. రాత్రిపూట పాలు పోసుకొని అన్నము తినండి.
8. సజ్జనుల యెడ ప్రీతి వహించండి.
9. సత్పురుషులతో సహవాసము చేయండి.
10. సేవకుల పై దయగలిగి ఉండండి.
11. స్వజనుల పై దాక్షిణ్యము చూపండి
12. ఆపద వచ్చినప్పుడు ఆకులపాటు చెందకండి.
13. ఉన్నను లేకున్నను మర్మము(రహస్యము) బయట విడవకండి.
14. పెద్దలు వచ్చినప్పుడు దిగ్గున లేచి భక్తి సల్పండి.
16. హితుల మేలు ఎన్నడూ మరవకండి.
మనకి మంచి జరుగుతుంది అనుకున్నా.. మనం చేసే పనివల్ల ఎదుటివారికి మంచి జరుగుతుంది అనుకున్నా.. రైట్ మూమెంట్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. మనం చేసేది మంచి పని అయితే ఎప్పుడైనా చేసేయొచ్చు. మనం చేసే పని వల్ల ఇతరులకు హాని కలగనంతవరకు మనం ఏ పనినైనా.. ఎప్పుడైనా చేయవచ్చు. దానికోసం మంచి మూహుర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేసే పని మంచిదైతే.. ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది.  98

కామెంట్‌లు