" ఈ దుస్థితి కి మందేది....!? ఆ వైద్యు డెవరు....?! - కోరాడ నరసింహా రావు.!
చిచ్చు లు రగిలించి.... 
  చలి కాచుకుంటూ... 
  వేచ్చని గెలుపును
   ఆస్వా దిస్తున్నారు...! 

కులాల పేరుతో.... 
 మతాల పేరుతో.... 
  వర్గాల పేరుతో... 
   ప్రాంతాల పేరుతో... 
   వాదాల పేరుతో.... 
    విమర్శల పేరుతో.... 
     సమీక్షల పేరుతో.... 
     డిబేట్ ల పేరుతో..... 
     విబేధాలు సృష్టి0చి... 
     వివాదాలు పుట్టించి... 
     విద్వేషాలు రెచ్చగొట్టి
   కల్లో లాలకు... 
    కారణమైన వార0తా
   విజయాహకా0ర0తో
  చెల రేగి పోతున్నారు...! 

ప్రతి చోటా...  క్షణ ... క్షణం
 సామరస్యముగా.... 
 సుహృద్భావ ప్రేమ తత్వంతో
 నీతి, న్యాయాలతో, ధర్మ బద్ద మైనజీవితాన్ని గదాపాలను కునేవారు.... 
   ఆత్మ శా0తి కరువై.... 
అన్యాయాలను సమర్ధించలేక, 
 అంగీకరించలేక... 
    ఓడి పోయి... బ్రతుకు తున్నా రు..!! 
  ఇది యుగ ప్రభాావమా...!? 
  పరస్పర కక్ష సాధింపులా...?! 

   మనిషి నైతిక పతనమా..!?!? 

ఏది ఏమైనా.... 
  ఇది  ఈ  మానవ సమాజాల
     దు స్థి తి...!! 
  ఈ దుస్థితిని బాపే మందేది !? 
  ఆ వైద్యు డెవరు...?! 
       *******
కామెంట్‌లు