బొమ్రెస్ పెట్ లో ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి ;- వెంకట్ :మొలక ప్రత్యేక ప్రతినిధి
 ఆమె ప్రపంచ మహిళలందరికీ ఆదర్శం

 భారతదేశంలో మొట్టమొదటి పంతులమ్మ సావిత్రిబాయి పూలే శ్రీ విద్య కోసం కృషి చేసిన సంఘ గొప్ప సంస్కర్త ఆమె సేవలు సమాజానికి ఎంతో ఉపయుక్తమని వక్తలు కొనియాడారు నేటి సమాజంలో మహిళలు అత్యున్నత స్థాయిలో ఉండి ప్రభుత్వంలో భాగస్వామ్యం భాగస్వామ్యంతో నేటి సమాజంలో సమ సమాజ నిర్మాణానికి మరియు స్త్రీ పురుషుల వివక్షత లేకుండా స్త్రీలు అన్ని రంగాలలో అత్యంత నిష్ణాతులై సమాజానికి తోడ్పాటు ఇస్తున్న ఈ సందర్భంలో సావిత్రిబాయి పూలే గారు ఆదర్శవంతంగా వీరందరికీ స్ఫూర్తిదాయకంగా చెప్పవచ్చు కాబట్టి నేటి సమాజంలో మహిళల విద్య అనేది ఎలాంటి కులమత బేధాలు లేకుండా ఆర్థిక వివక్షత లేకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి సమాజంలో ముందు వరుసలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మహిళల విద్య కుటుంబానికి మరియు సమాజానికి ఎంతో అవసరం అనేది మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయు రాలు మాత సావిత్రిబాయి పూలే గారు అనేక అవమానాలు ఆటంకాలను అధిగమించి విద్యా బోధన చేసి నేటి మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు అని వక్తలు కొనియాడారు ఇట్టి కార్యక్రమంలో ఎంఈఓ రామిరెడ్డి గారు జిహెచ్ఎం హరిలాల్ గారు పాపి రెడ్డి గారు మరియు చౌదర్పల్లి క్లస్టర్ హెడ్మాస్టర్ శ్రీహరి రెడ్డి గారు విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ పిఆర్టియు అధ్యక్షులు అనిల్ కుమార్ తపస్ అధ్యక్షులు బాకారం చంద్రశేఖర్ టి యు టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి గౌరారం గోపాల్ గారు మరియు మహిళా ఉపాధ్యాయురాలు శ్రీ ప్రియ గారు అనురాధ గారు బాకారం శోభారాణి ఐ ఈ డి  టీచర్ వేణుగోపాల్ ఎమ్మార్సీ సిబ్బంది గౌస్ మరియు ఖలీల్ పాల్గొనడం జరిగింది


కామెంట్‌లు