నేటి సమాజం ( నానీలు ) - కొరాడ నరసింహా రావు

 సమూహాల నుండి
  సమాజాలుగా... 
కుల మత, వర్ణ, వర్గ
వైషమ్యాలతో.....! 
     *****
కులాలకువిలువిస్తూ
  మానవత్వ మౌలికత
  మరిచి పోయింది
   సమాజం...! 
   ********
అనేక సంస్థ లు
 వ్యవస్తల తో
  సుఖమయ ,సమిష్టి  
  జీవనం...! సమాజం!! 
      *****
సామాజిక సమిష్టి... 
 ప్రయోజనాలు..! 
  నేటి సమాజం లో... 
  స్వ ప్రయోజనాలు..!! 
     *****
సర్వ మానవ
  సుఖ, సౌభ్రాతృత్వాలకు
  విఘాాత కారి... 
   నేటి సమాజం...! 
    *******
కామెంట్‌లు