శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది -ఎం. వి. ఉమాదేవి
76)విక్రమీ -

విశిష్ట గురుపాదచిహ్నాలవాడు
అమితశౌర్యాన్ని గల్గినవాడు
ధైర్యమును ప్రసాదించువాడు
పరాక్రమవంతుడైనట్టి వాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
77)ధన్వీః -

దుష్టశిక్షణ చేయుచుండువాడు
రక్షణ ఆచరించు వాడు
ఆ సంకల్పం ఉన్నట్టివాడు
శార్గం ధనుసు ధరించినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
78)మేధావీ -

అపరిమిత మేధగలవాడు
అసాధారణ తెలివిమంతుడు
గొప్ప జ్ఞాపకశక్తియున్న వాడు
సర్వవిషయాల విజ్జతున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
79)విక్రమః -

బ్రహ్మాండo కొల్చిన అడుగులవాడు 
వామనమూర్తి అయినవాడు
పక్షిరాజ విహారి ఐనట్టివాడు 
నిత్యమందు పయనించువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
80)క్రమః -

సమస్తం క్రమంగా నడిపేవాడు
జీవచేతన హేతువైనవాడు 
అసాధారణ విభవుడైనవాడు 
సంసారసాగరం దాటించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు