తిరుప్పావై ; - వరలక్ష్మి యనమండ్ర
21వ పాశురం..
**********
ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్ ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుణాయ్ ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్ తోత్తమాయ్ నిర్ణ శుడరే! తుయిల్ ఎరాయ్ మాత్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్కణ్ ఆత్తాదు వందు ఉన్-అడిపణియుమా పోలే పోత్తియాం వందోం పుగరందు-ఏలోర్ ఎంబావాయ్.
*********
భావం‌..........పంచపదులలో
*********
21. వ పాశురము.....భావము

దూడలు పక్కన లేకుండిననూ మీయింట
పాలు ఉండునని తెలియును మీయింట
కుండల కొలదీ పాలు యుండును మీయింట
నందకుమారా తేజోవంతా మీ యింట
ఆడెడు గోపెకల దాహము తీర్చగ గోపాలా... కృష్ణా 

ఉపనిషత్తులే గోవులు కాగా
గోపాలకుడే గోవిందుడు కాగా
పార్ధుల వంటి దూడలుండగా
గీతామృతమును గ్రోలుటకేగా
కార్య శూరుడా కారణ జన్ముడా.. కృష్ణా 

నీ గుణగానము మేము చేయుదము
నీ చరణములే నమ్మి యున్నాము
మీ ఇరువురకూ శుభ మంగళము
విఠలా మేము పాడుచున్నాము
నిదుర లెమ్ము గోపాలా ,నీలమ్మా... కృష్ణా 

అహమును మేము విడిచెదము
స్నాన వ్రతమునకు వచ్చినాము
నీ కీర్తనలము మేము పాడెదము
మేము వేచియుంటిమీ నీ కోసము
నందనందనా కన్నయ్యా లేవయ్యా .. కృష్ణా

కామెంట్‌లు