సుప్రభాత కవిత ; - బృంద
కలవరం నిండిన గుండెలో
పండు వెన్నెల్లు కురవ
చిన్నబోయిన మదిని
చిరునవ్వులు చిందగా

కదిలిరా కాలమా
కనికరము చూపి
తరలి రావమ్మ నీవు
వరమిచ్చి బ్రోవగా

అనునయించక నన్ను
వదిలిపోకు నేస్తమా
మరచిపోయిన నవ్వుల
మరల పూయించుమా

ఎదురు చూచిన క్షణము
ఎడదను పొంగించ
ఏకధాటిగ సంతసము
ఏరువాకగ  రాగా

గడిచేటి నిమిషాలు
ఒడిసిపట్టగ నేను
నిలిచి ఉన్నాను కదలక
తెరిచిన తలుపుల దాపున

నీవు వచ్చు దారిని
నా చూపులు పరచి
అడుగుసవ్వడులు
ఆలింప వేచితిని

వేగముగ వెలుగులు తెచ్చి
వేకువను కానుక  చేసి
వేసారిన  హృదయానికి
వేడుకలు వరముగా ఇచ్చు

నులివెచ్చని ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు