శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
91)అహః -

ఎవరినీ వదలనట్టివాడు
ప్రకాశంగా నుండెడివాడు
అజ్ఞానం తొలగించువాడు
భక్తులను కాపాడగలవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
92)సంవత్సరః -

భక్తులను ఉద్ధరించగలవాడు
కాలమెల్లను తోడుండువాడు
సమయస్వరూపమైన వాడు
కాలమును గ్రహించినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
93)వ్యాళః -

భక్తినివేదన స్వీకరించువాడు
శరణాగతిని యిచ్చువాడు
సర్ప,వ్యాఘ్ర,గజ విజయుడు
ఎవరికీ చేజిక్కని వాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
94)ప్రత్యయః -

ఆధారపడదగినట్టి వాడు
విశ్వసింప దగినవాడు
నమ్మి కొలువదగినవాడు
స్వామి భక్తికిదాసుడైనవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
95)సర్వదర్శనః -

సమస్తమును చూచుచుండువాడు
కటాక్షవీక్షణములిచ్చువాడు
పరిపూర్ణ విభవమున్నవాడు
తనభక్తులకు చూపించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు