శ్రీ విష్ణు సహస్రనామాలు ;- (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
111)పుండరీకాక్షః -

భక్తహృదయపద్మ నివాసకుడు
భక్తిపద్మమునూ దర్శించువాడు
పులికన్నులవంటి సుందరుడు
పుండరీకుని బ్రోచినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
112)వృషకర్మాః -

ధర్మమందు అనురక్తియున్నవాడు
ధర్మకార్యక్రమంలోనున్నాడు
పనియందునూ ధర్మాచరణుడు
ధర్మంలోనే లీనమైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
113)వృషాకృతిః -

అగ్ని సమానుడైయుండువాడు 
సాధురూపమునయుండువాడు
ధర్మమే మూర్తిగా గల్గినవాడు
స్వామి వృషాకృతిదాల్చినవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
114)రుద్రాః -

రుద్రుడైయుండునట్టి వాడు
దుఃఖవిమోచన చేయగలవాడు
దుఃఖకారణం తొలగించువాడు
శోకమును దూరముంచువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
115)బహుశిరాః -

అనేక శిరస్సులున్నట్టివాడు
జ్ఞానవంతుడై విరాజిల్లువాడు
ప్రధానముగా నిలిచినవాడు
శిఖరసమానుడైనట్టి వాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు