హిందూ సంస్కృతికి దర్పణం!అచ్యుతుని రాజ్యశ్రీ

 కంచి కామకోటి పీఠాధిపతి విద్యాతీర్థస్వామి శిష్యుల్ని ప్రశ్నించారు "మీరు ఏంకావాలను కుంటున్నారు?" అంతా తలొక జవాబు చెప్తే ఆశిష్యుడు మాత్రం " దేశ రక్షణ ధర్మరక్షణ కు నాజీవితం ధారపోస్తాను" అని అన్నాడు.క్రీ.శ.1268 లో పంపాక్షేత్రం లో పుట్టిన ఆపిల్లాడు వేదాంతం కళలకు సంబంధించిన విభాగాల్లో పండితుడైనాడు.విదేశీ దాడులనుంచి దక్షిణ భారతంని రక్షించి రాజ్యస్థాపన చేయాలని ఆయన సంకల్పం.వైతిహోత్రి అనే ఆమెతో వివాహం ఐంది.మహ్మద్ బిన్ తుగ్లక్ పాలన లో అరాచకం ప్రబలింది.కానీ తపోశక్తి కూడా అవసరం.తల్లి భార్య మరణంతో ఐహిక బంధాలు తొలిగాయి.ఆయన పంపావిరూపాక్ష స్వామి గుడిలో పూజచేసి తుంగభద్రా నది ఒడ్డున కునుకు తీశారు.భువనేశ్వరీమాత దర్శనం ఐంది." దక్షిణ భారత దేశంలో రాజ్యంకి పునాది వేయి" అని అమ్మవారు ఆదేశించింది.అంతే!12 ఏళ్ళు కఠోర తపస్సు చేశారు ఆయన.దేవీ ప్రసన్నురాలైంది.శృంగేరిపీఠాధిపతి వద్ద సన్యాసదీక్ష తీసుకున్నారు.ఒకరోజు ఇద్దరు వీరులు తుగ్లక్ సైనికుల నిర్బంధం నుంచి తప్పించుకుని ఈసన్యాసిని ఆశ్రయించారు.వారు స్వామివారి అనుగ్రహం తోఆనెగొంది కోటను వశపర్చుకున్నారు.ఆపై పంపాక్షేత్రం లో కొత్త నగరంకి శంఖుస్థాపన చేశారు భువనేశ్వరి అమ్మ వారి దయవల్ల స్వామివారికి కర్ణాటక రాజ్యస్థాపకునిగా కీర్తి లభించింది.ఆయన సర్వార్థ సారసంగ్రహం అనే గ్రంథం రచించారు. 15 రాగాలముఖ్యలక్షణాలు తెలియజేస్తూ సంగీత సార అనే గ్రంథం రచించారు. నాల్గు వేదాలు ఉపనిషత్తులకు వ్యాఖ్యరాశారు.జైనుల శ్రీవైష్ణవులమధ్య పొరపొచ్చాలు కలహాలు ఏర్పడితే ఆయన పరిష్కరించారు.శృంగేరి శారదా పీఠాధిపతి ఐనారు55ఏళ్లు తన  ధర్మబోధలు కార్యదక్షత తో ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన ఆయన 118 వ ఏట సిద్ధిపొందిన మహనీయుడు.కర్ణాటకప్రజలు హంపీలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.నేడా నగరం తెలుగు రాష్ట్రం లో భాగంగా విశేష మన్ననలు పొందుతోంది 🌷
ఆపుణ్యమూర్తి విద్యారణ్యస్వామి.అసలు పేరు మాధవాచార్య.ఆనాటి కంచిపీఠాధిపతి విద్యాతీర్థస్వామి అనుగ్రహంతో సకల శాస్త్రాలు అభ్యసించారు.హరిహరరాయలు బుక్క రాయలకు మార్గనిర్దేశం చేశారు.అలా విద్యలనగరం విజయనగరం ఏర్పడింది 🌷
కామెంట్‌లు