ఆశ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 అగరుబత్తీలు
రెండు రకాలు
ఒకటి దేవుడికోసం
మరోటి దోమలకోసం
ఐతే
ఇబ్బంది ఏమిటంటే….?
దేవుడు ఎన్నడూ రాడు
దోమలు ఎన్నడూ వెళ్ళిపోవు
ఐనా
మనం నిరాశచెందక
మళ్ళీ మళ్ళీ
రోజూ రోజూ
అగరుబత్తీలు
వెలిగిస్తూనే ఉన్నాం కదూ!!!
*************************************

కామెంట్‌లు