గాయపడిన మనసు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తుంచినా
ఊహ
వదిలిపోవటంలేదు

తెంచినా
పువ్వు
వాడిపోవటంలేదు

వద్దన్నా
పరిమళం
వీచుటమానటంలేదు

ఏడ్చినా
కన్నీరు
కారటంలేదు

గాయపరచినా
గుండె
ప్రతిఘటించుటలేదు

వలదన్నా
చిరునవ్వు
విడిచిపోవటంలేదు

దూరమైనా
ప్రేమ
తరగిపోవటంలేదు

ఆలోచనలు
అంతరంగాన్ని
అంటిపెట్టుకునేయున్నాయి

స్మృతులు
మనసును
ముట్టడిచేస్తూనేయున్నాయి

మాటలు
మదిని
ముట్టేస్తున్నాయి

మాను
చిగురిస్తుందా
మనసు
వికసిస్తుందా


కామెంట్‌లు