కవుల
కళ్ళల్లో
అందాలు
తిష్టవేస్తున్నాయి
కవుల
ముఖాల్లో
ఆనందాలు
వ్యక్తమవుతున్నాయి
కవుల
నిద్రల్లో
కమ్మనికలలు
కోర్కెలులేపుతున్నాయి
కవుల
తలల్లో
తలపులు
తడుతున్నాయి
కవుల
మదుల్లో
మీటను
నొక్కుతున్నాయి
కవుల
కలాల్లో
అక్షరాలు
నిండుతున్నాయి
కవుల
కాగితాల్లో
కలాలు
పదాలుకారుస్తున్నాయి
పాఠకుల
హృదయాల్లో
కవితలు
స్థిరంగానిలిచిపోతున్నాయి
కవనలోకంలో
కవులవ్రాతలు
తారకలులా
తళతళలాడుతున్నాయి
కవులు
సరస్వతీపుత్రులు
స్మరణీయులు
చిరంజీవులు
కవులను
ప్రోత్సహిద్దాం
గుర్తించుదాం
మెచ్చుకుందాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి