సౌందర్యలహరి; -కొప్పరపు తాయారు
 🌻శంకరాచార్య విరచిత🌻

శరజ్జ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటమకుటాం
వరత్రాసత్రాణస్ఫటికఘటికాపుస్తకకరామ్ ।
సకృన్న త్వా నత్వా కథమివ సతాం సంన్నిదధతే
మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః భణితయః ॥ 15॥ వర్ ఫణితయః
కవీంద్రాణాం చేతఃకమలవనబాలాతపరుచిం
భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ ।
విరించిప్రేయస్యాస్తరుణతరశ‍ఋంగారలహరీ-
గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ ॥ 16॥
 
15) అమ్మా !లోకంలో మధుర వచనాలు పలుకాలన్న, అమృత తుల్యమైన కవిత్వం చెప్పాలన్న ,శరత్కాలంలో వెన్నెల వలె శుభ్రమైన చంద్రునితో కలిసి ఝటా రూప కిరీటంతో, చేతులు యందు వరద అభయ ముద్రలను దాల్చి స్పటిక మాలలు పుస్తకాలు ధరించిన నీకు ఒక్కసారైనా ప్రణమిల్లకపోతే మధు క్షీర ద్రాక్షా సదృశ్యమైన మధుర వచనాలు కవులకు ఎలా సిద్ధిస్తాయి !

16) ఓ జగన్మాతా! తల్లీ! పద్మములను ఉదయకాలపు లేత ఎండ ఎలా వికసింప చేస్తుందో,
అలాగే కవుల మనుసులనెడి, పద్మములకు వికాసము కలిగించు అరుణ రాగ రంజిత శరీరవగు నిన్ను ఏ మహాత్ములు మనసారా భజింతురో, వారు శారదా దేవి (సరస్వతి దేవి) ప్రసాద కృపా కటాక్షములు పొందుదురు. అరుణాదేవి ధ్యానించువారు సరస్వతీ సమానులగుదురు!!!

****🪷*****

కామెంట్‌లు