సుప్రభాత కవిత ; బృంద
అలజడి రేగిన హృదయంలో
కలతల మబ్బుల కదనంలో
నీడల జాడలు పోగొడుతూ
తూరుపు తలుపు తీసింది

తలపుల తీగలు తెంపేస్తూ
వగపుల వ్యధలు మరిపిస్తూ
వరుసగ కిరణం ఝళిపిస్తూ
వెలుగుల వసుధను నింపేస్తూ..

వేగుచుక్క పొడిచాక
వెన్నెల తెల్లబోయేలా
వెచ్చగ సోకే స్పర్శలతో
వెల్లువగ పుడమిని పాకేస్తూ

నిశిని పరచిన నిరాశల
అడుగుజాడల అలికేస్తూ
అణువణువూ ఆశలు చిమ్ముతూ
ఉషను ఉర్విపై స్వారీ చేయిస్తూ

అలుపెరుగని యాత్రికుని
పిలుపులకు చేయందిస్తూ
కలుపులన్నీ తొలగిస్తూ
గెలుపు దిశగా అడుగేయిస్తూ

రంగుల కొంగులు పరచిన
నింగిని చూసి పొంగిపోయి
జిలుగుల బహుమతినిస్తూ
నలుదిశలకు  కృపనందిస్తూ

ఆగమించు ఆదిత్యునికి

🌸🌸 సుప్రభాతం🌸🌸

 

కామెంట్‌లు