"మొలక". కవయిత్రి , మొల్ల కళావేదిక ఆధ్వర్యంలో నేషనల్ గర్ల్ చైల్డ్ డే ";- KVM వెంకట్: ప్రత్యేక ప్రతినిధి


 
బొమ్రేస్ పెట్ KGBV పాఠశాలలో ఘనంగా" నేషనల్ గర్ల్ చైల్డ్ డే "
ఆడపిల్ల చదువు అవనికి వెలుగు అమ్మాయిలు సీతను ఆదర్శంగా తీసుకోవాలి:
 ఎంఈఓ రాంరెడ్డి
 బాలల మాస పత్రిక "మొలక "ను అభినందించిన ఎంఈఓ రామ్ రెడ్డి
జాతీయ బాలికల దినోత్సవం జనవరి 24 ను పురస్కరించుకొని తాండూరు కవయిత్రి మొల్ల కళావేదిక , బాలల మాసపత్రిక మొలక ఆధ్వర్యంలో ఘనంగా గర్ల్ చైల్డ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమం  బొమ్రాస్పేట్ మండలం  చెట్టు పల్లి తాండ కేజీబీవీ పాఠశాల పాఠశాల ప్రత్యేక అధికారిని రాధికా రెడ్డి
అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మండల  విద్యాధికారి రామ్ రెడ్డి ,తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్,  ప్రకృతి వ్యవసాయ ప్రేమికురాలు ఝాన్సీ లక్ష్మీబాయి ,కవయిత్రి  మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు
మొలక ప్రత్యేక ప్రతినిధి,
 KVM వెంకట్, శ్రీ రామకృష్ణ సేవాసమితి కొడంగల్ అధ్యక్షులు బాకారం చంద్రశేఖర్ , ఉపాధ్యాయులు గోపాల్ హాజరయ్యారు.
 పాఠశాల విద్యార్థులు గర్ల్ చైల్డ్ డే సందర్భంగా సాంస్కృతి కార్యక్రమాలు  ఘనంగా నిర్వహించారు.
విద్యార్థుల ఉపన్యాసాలు
అందరినిఅలరించాయి.
 విద్యార్థులు చక్కగా కండ్లకు కట్టినట్లుగా నిర్వహించిన మైమ్ షో  ఆడపిల్ల  గొప్పతనం ఆలోచింపజేసింది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
విచ్చేసిన ఎంఈఓ రామ్ రెడ్డి
 పాల్గొని మాట్లాడుతూ బాలికలు చదివినప్పుడే వారి దేశాలు మరింత శక్తివంతమవుతాయని
ఆడపిల్లల చదువు అవనికి  వెలుగు అని
భారతదేశానికి సీతారాములు ఆదర్శం
సీత పడ్డ కష్టాలను ఆకలింపు చేసుకొని ఆమెని ఆదర్శంగా తీసుకోవాలన్నారు
ఈ సృష్టిలో  స్త్రీ లేక లేకపోతే జననము లేదు
కాబట్టి ఆడపిల్లని ఎదగనిద్దాం వారిని రక్షిద్దామన్నారు
 మొలక  బాలల మాసపత్రిక చిన్నారుల కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎడిటర్ వేదాంత సూరి నీ అభినందించారు.
ప్రకృతి వ్యవసాయ ప్రేమికురాలు ఝాన్సీ లక్ష్మీబాయి పాల్గొని మాట్లాడుతూ  ప్రకృతి అంటే ఒక భూమాత. భూమిని, భూసారని కాపాడుతూ భవిష్యత్ తరాలకు బంగారు  నేలను అందించి ఈ చిన్నారులను బంగారు తల్లుల చేద్దామన్నారు. చిన్నప్పటినుండే ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెంచుకోవాలన్నారు మేము చదువుకుంటున్నప్పుడు  మీకున్నంత సౌకర్యాలు లేవని మేము  పడ్డ కష్టం వర్ణాతితం
ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుందన్నారు బాగా చదవాలన్నారు
తమవంతుగా అర్పన్స్ చిన్నారులకు సహాయం అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు 200 పెన్నులను, ఒక మొక్క ను అందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్
పాల్గొని మాట్లాడుతూ ఆడపిల్ల అంటే లేడీ పిల్ల కాదు .పులి పిల్లల బతకాలి అన్నారు. సమాజం అందిస్తున్న ప్రతిదాని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు. మొలక చిన్నారుల కోసం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.
శ్రీ రామకృష్ణ సేవ సమితి కొడంగల్ అధ్యక్షులు బాకారం చంద్ర  శేఖర్ మాట్లాడుతూ  రేపటి రోజులు బాగుండాలంటే మనం బాలికలకు అవకాశాలు ఇవ్వాలన్నారు అందుకే శ్రీ రామకృష్ణ సేవాసమితి ఏర్పాటై స్వామి వివేకానందుని ఆశయాల కోసం విద్యార్థులకు పోటీ తత్వం పెంచడం కోసం  స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వ్యాసరచన వకృత పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తున్నామన్నారు
ఈ కార్యక్రమంలో తాండూరు కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు మొలక ప్రత్యేక ప్రతినిధి KVM వెంకట్ పాల్గొని మాట్లాడుతూ  ఆడపిల్లకు శక్తినివ్వాలి ఆమెను ఆకాశమంత ఎత్తుకు ఎదగనివ్వాలి.  ఆడపిల్లలు ఎదగడానికి ప్రపంచం కావాలి ఎదిగిన తర్వాత ప్రపంచానికి వారు కావాలి.  ఈ మొలక దశలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలన్నారు.
ఉన్న స్థానం నుండి ఉన్నత స్థాయికి రావాలి అంటే
కవయిత్రి మొల్ల,  ఇందిరాగాంధీ కల్పనా చావ్లా, ఇస్రో చంద్రయాన్ 3 సైంటిస్టు శ్రీకాళహస్తి కల్పన ,
  సాకలి ఐలమ్మ ,డొక్క సీతమ్మ లాంటి వీర వనితలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులలో మానవతా విలువలతో వ్యక్తిగత వికాసం కోసం వారి జీవితాలను మెరుగుపరచడం కోసం బాలల మాస పత్రిక "మొలక" పనిచేస్తుందని మొలక ను చదవండి మహా వృక్షం లా ఎదగండి అన్నారు.
 ఈ కార్యక్రమంలో ఐదు నుండి పదవ తరగతి వరకు పాఠశాల లో టాపరుగా నిలిచిన విద్యార్థులను అభినందిస్తూ వారికి మొలక తరపున బహుమతులు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు
 ఆరవ తరగతి అక్షర,
ఏడవ తరగతి పూజ
8వ తరగతి ఆధ్యా
9వ తరగతి స్వప్న
పదో తరగతి నికిత
లకు ఎంఈఓ ఉపాధ్యాయులు కమిటీ మెంబర్స్ అందజేశారు
 ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవాసమితి  కొడంగల్  శాఖ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా
నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు బహుమతుల ప్రధాన దాత డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీందర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
అందులో వ్యాసరచనలో నవ్యశ్రీ
ప్రథమ
డి దివ్య ద్వితీయ
వక్రత పోటీల్లో
 ఆర్ నికిత
తనుజ
అర్చన
పూజ
వైశాలి
సాత్విక
విద్యార్థులను
అభినందించి
సర్టిఫికెట్స్ ,మెడల్స్ పుస్తకాలను అందించారు.
 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిట్స్  సూపర్ విద్యార్థులను క్రాఫ్ట్ సవితను అభినందించారు.
గర్ల్ చైల్డ్  డే పురస్కరించుకొని పాఠశాల ఆవరణంలో అందమైన ముగ్గులు  చిన్నారులు వేశారు
 పాఠశాలలో అన్ని డ్యాన్సులలో పర్ఫామెన్స్ ఇచ్చిన  ఏడవ తరగతి వైష్ణవి ని ప్రత్యేకంగా ఎంఈఓ తో పాటు అందరూ అభినందించారు.
ఈ మంచి కార్యక్రమాన్ని పాఠశాలలో ముఖ్య అతిథులు భక్తులు సమయమిచ్చి నిర్వహించినందుకు  వారికి ఎస్ ఓ రాధిక రెడ్డి తో పాటు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో  ఎంఈఓ రామ్ రెడ్డి ప్రకృతి ప్రేమికురాలు ఝాన్సీ లక్ష్మీబాయి ,టీవివి రవీందర్,  శ్రీ రామకృష్ణ సేవ సమితి అధ్యక్షులు బాకారం చంద్రశేఖర్, ఉపాధ్యాయులు గౌరారం గోపాల్, కేజీబీవీ
ఎస్ ఓ రాధిక రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు
శ్యామల
సురేఖ
సృజనా దేవి
ప్రవళిక
నందిని
నర్సమ్మ
జ్యోతి సునీత
శ్రీలత
సవిత  తో పాటు విద్యార్థులు  పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు పలువురికి పాఠశాల తరఫున ఎస్ ఓ రాధిక రెడ్డి ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.


కామెంట్‌లు