అన్ని దానాల్లో విద్యా దానం ఎంతో గొప్పది.. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క; Kvm వెంకట్ :మొలక ప్రత్యేక ప్రతినిధి
 గండిపేట ఎన్టీఆర్  ట్రస్ట్ స్కూల్ వార్షికోత్సవంలో మాట్లాడుతూ లాయర్ నై నా కేసులు నేనే వాదించుకున్నా

అన్ని దానాలలో విద్యాదానం ఎంతో గొప్పదన్నారు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క
గండిపేటలోని ఎన్టీఆర్ ట్రస్టు స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్టు తరఫున ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నక్సలైట్  గా ఉన్న తాను బయటికి వచ్చి చదువుకొని లాయర్ గా తన కేసులు తానే వాదించుకున్నాను చెప్పారు. తను చేసిన సేవ మాత్రమే తనను ఇక్కడ నిలబెట్టింది అన్నారు. ఎదుటివారి సమస్యలు పరిష్కరించే స్థాయికి విద్యార్థులు వెళ్లాలని చెప్పారు ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఎందరికో రాజకీయ బిక్ష పెట్టారన్నారు. నా పొలిటికల్ లైఫ్ టిడిపి తోనే స్టార్ట్ అయిందని తను టిడిపిలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ డ్రస్సు స్కూల్లో ఎందరినో జాయిన్ చేశానని 20 ఏళ్ల క్రితం చంద్రబాబు పెట్టిన ఈ స్కూల్ ఎందరికో జీవితం ఇచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దేవి పాఠశాల యాజమాన్యం 
విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు
పాల్గొన్నారు.విద్యార్థుల సంస్కృతి కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.

కామెంట్‌లు