తాండూరు కేజీబీవీ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం;- KVM వెంకట్:మొలక ప్రత్యేక ప్రతినిధి అలరించిన విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు
 బహుమతులు ప్రధానం చేసిన తాండూరు లైన్స్ క్లబ్ అధ్యక్షులు  బసన్నప్ప
తాండూరు కవిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు KVM వెంకట్ 
గుంత బస్పల్లి, ఇనెల్లి సర్పంచ్ లను, ఉపసర్పంచులను సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయ బృందం
 వికారాబాద్ జిల్లా తాండూరు మండల్  జిన్గూర్తి గేటు సమీపం లో  ఉన్న KGBV కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఘనంగా వార్షికోత్సవం నిర్వహించారుఈ కార్యక్రమంలోమొదట సరస్వతి పూజనిర్వహించి ,కస్తూర్బా గాంధీ   చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాతాండూరు లైన్స్ క్లబ్ అధ్యక్షులు బసన్నప్ప
 ఆత్మీయ అతిథి కవయిత్రి మొల్ల  కళావేదిక  ఫౌండర్  అధ్యక్షులు, బాలల మాస పత్రిక ప్రతినిధి కేవీఎం వెంకట్,
 పాఠశాల ప్రత్యేక అధికారిని (SO) విజయ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కేజీబీవీ జూనియర్ కళాశాలలో చదువుతున్న పూజ డిజేబుల్ కట్టర్ ప్రాజెక్టుతో ఢిల్లీలో ఇన్స్పైర్ అవార్డు అందుకున్న సందర్భంగా విద్యార్థిని ముఖ్య అతిథుల చేత ఘనంగా సన్మానించారు.అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథి తాండూరు లైన్స్ క్లబ్ అధ్యక్షులు  బసనప్ప పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సంస్కారం నేర్చుకోవాలని క్యారెక్టర్ బిల్డింగ్ చేసుకోవాలని  ప్రతి పనిలో మంచి ఆలోచన సమాజానికి కావలసిన మానవ వనరులుగా ఎదగాలన్నారు . క్లబ్ తరఫున పాఠశాలకు మౌలిక సదుపాయాల విషయంలో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.పదవ తరగతి ,ఇంటర్ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం కూడా అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథి కవిత్రి  మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు KVM వెంకట్ పాల్గొని మాట్లాడుతూ ఆడపిల్లల చదువు ప్రపంచానికి వెలువని విద్యార్థులు వజ్ర సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో దూరదృష్టితో చదివి కవయిత్రి మొల్ల, కస్తూర్బా గాంధీ ,అబ్దుల్ కలాం స్వామి వివేకానంద లాంటి మహనీయులని ఆదర్శంగా తీసుకొని  ఉన్న స్థానం నుండి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారుప్రతి విద్యార్థి టీచర్ ని గైడ్ గా పెట్టుకోవాలన్నారు ఎస్ఎస్సి ఇంటర్లో మంచి మార్కులు సాధించిన వారికి బహుమతులు అందిస్తామన్నారమొలక పుస్తకాన్ని చదివి విద్యార్థులు ఓవరాల్ డెవలప్మెంట్  చెందాలన్నారు.
ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రత్యేక అధికారిని విజయరత్నఉపాధ్యాయ బృందం కలసి గుంత బాసుపల్లి , ఇనెళ్లి సర్పంచులు స్వప్న రెడ్డి. జగదీష్ఉపసర్పంచ్ వెంకట్ గౌడ్గోవిందు లను5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వార్షికోత్సవం  సందర్భంగా 5నుండి 10 తరగతుల వరకుప్రతిభ కనబరిచిన విద్యార్థులకు
పురస్కారాల అందజేశారు.పాఠశాలను క్రమశిక్షణలో నడిపిస్తున్న SO విజయ రత్న ను అభినందించి సన్మానించారు
ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన టీచర్స్కు బహుమతులను ప్రధానం చేశారు.
విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.తెలంగాణ మైనార్టీ  గురుకుల ప్రిన్సిపల్ గంగయ్య యాదవ్
శ్రీనివాస్ రెడ్డి, ప్రత్యేక అధికారిని విజయ రత్నఉపాధ్యాయ బృందం SO విజయరత్నస్వరూప రాణిజరీనా వాణిశ్రీ హేమలత సులోచన శ్రీదేవి ప్రమీల బాలమణి సుమలతశిరీషసవిత సంధ్య, రాగిణిమమతనాజీయ బేగంగౌరీనాన్ టీచింగ్సిబ్బంది అంజిలమ్మ
కళావతిఅనిత భీమమ్మబేబీ బేగంవెంకటమ్మ నరసమ్మ పేరెంట్స్ విద్యార్థులు పాల్గొన్నారువిమల్ వాజ పాఠశాల మౌలిక సదుపాయాల కోసం 11,000 రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారుకామెంట్‌లు