శ్రీరామ ఏకపంచాశత్ పద్య హారము ;- డి.వినాయక్ రావు, M.A. M.Ed , లోకేశ్వరము ఫోన్:9440749686

 1.కం:కొలుతును కోసల రాజా
సలుపగ నీసేవ లన్ని శ్రద్ధగ నేనున్
తలచిన నీవస్తావని 
తెలుపెను మా హనుమ సామి దీవెనలివ్వన్
2.కం:రాముని ప్రాణ ప్రతిష్ఠగు
రామయె వామమున నుండ లక్ష్మణ కుడికున్ 
రామందాడిగ జనమున్
రామా రామంటు చేరు రాము నయోధ్యన్
3.కం:కుశలము రామ స్మరణము 
యశనము నొసిగేను నామ  మారాధించన్
వశములు ఫలింప జేయును
విషమగు పాపములబాపి వెతలను దీర్చున్
4.జై శ్రీరామ నినాదం
నాశ్రపణములా రుచించు నాడగ నోటన్
నాశ్రయమిచ్చును నర్తికి
నాశ్రిత వత్సలుడు రామ నానందముగన్
5.కం:రాఘవునారాదించుము
భోగములవితర్లి వచ్చు పుటపుటనములై
సాగును కార్యము లన్ని న
మోఘములై వృద్ధినొంది మోదమునిచ్చున్
6.కం:రాముని వాక్కూ సత్యము
నేమము ధర్మంబు నీతి దాక్షిణ్యంబున్
కామము నెర్గని మనసది
తామసముకు చోటులేని దండిహృదయమున్
7.కం:రక్షణ నిచ్చెడి మంత్రము
లక్షణమైనట్టి రామ రక్షాస్తోత్రం
తక్షణ కర్తవ్యమనిన్
దక్షుడిగా మారి చదివి దాపురమొందుం
8.కం:శ్రీరాముని అక్షతలున్
దారముకడ వచ్చు చున్న దైవత రూపం
వారగు పుణ్యాత్ము నిలన్
చేరగ నవి ప్రతి గడపకు చేదోడవ్వన్
9.కం:మరువకు రాముని నామము
పరువగు భవమందు మంత్ర వారిరథమదిన్
తరువుగ నీడిచ్చదియున్
బరువగు దుఃఖములు బాపి బద్రము  నిచ్ఛున్
10.కం:రాముని చరితన్ మధురము
రామాయణకావ్య పఠన లక్ష్మీ కరమౌ
రాముని కథలను విన్నన్
రామకముగ నుండవి జన రంజిని బాపున్
11.కం:సత్యము ధర్మము క్షమయున్
నిత్యము నీతోనె నంట నీకే సాధ్యం
ముత్యపు చిప్పల రామా
నత్యంతము వాటి రక్ష, ఆదిపురుషుడా !
12.కం:జానకి మనోభి రాముడు
మానవుడిగ రూపమొందె మంచిని జూపన్
ప్రాణము ప్రజలందరికిన్
మానసమందుండి నడుపు మారుతిప్రభుగన్
13.కం:లక్ష్మణ నగ్రజ రామా
పక్ష్మములా మాకురక్ష వర్మమునీవే
యక్ష్మములను తొలగించుము
లక్ష్మీకరమైన దేహ లాఘవమిమ్మా
14.కం:నవ్వది నందము రాముడి
పువ్వుల విరబూసె మధుర ప్రోక్తంబవ్వున్
సవ్వడి కర్ణామృతమౌ
నివ్వెర పోయెట్టు నిగమ నిర్మల పాఠం
15.కం:ఋషివాల్మీకి విరచితము
విషయము రామాయణంబు విశ్వవిదితమున్
కుశలము చదువరి కిచ్చును
అశనంబది నారగింప నానందంబౌ
16.కం:రాతిని నాతిగ మార్చెను
సీతాపతి రామచంధ్ర శ్రీచరణంబుల్
నీతికి నిలబడు పాదము
ఖ్యాతిని పొందేను నేల హత్తుకొన నదిన్
17.కం:భక్తుల పెన్నిధి రాముడు
శక్తిన్ నిచ్చేను స్వామి  సంసేవించన్
యుక్తులనొసంగు భక్తుల
రిక్తంబాపంగ హస్త రిక్థము నొందన్
18.కం:రాముని కష్టాలెన్నియొ
సామిగ తానయ్యి దుఃఖ సాగరమీదెన్ 
దీమము కాననమయ్యిన
ధీమసముతొ గడిపె సామి తిప్పలు పడుతున్
19.కం:ఆనంద మయంబౌవున్
దీనుల నాతుడిది రామ తీర్థ మయోధ్యన్
త్రాణము నిచ్చెడి దామము
ప్రాణులు దర్శించి రామ పాదుకలత్తన్
20.కం:పాటలు ముద్దగు రాముని
మాటలు రామయ్య గాథ మరిమరి ముద్దున్
చోటు నయోధ్యగు ముద్దున్
బాటగు రామయ్య నడుచు పరిపరి ముద్దున్
21.కం:పాపడు రామయ్యంటున్
జోపాటలు పాడు చండ్రు జోజో మంటున్
పాపగ రామయ్యింటున్
స్వాపము తా నొందు చుండు సంతోషముగన్
22.కం:సరయూ నది తీరంబున
హరియగు రామయ్య నగరు నాకృతి నొందెన్
సిరియగు సీతమ్ముండన్
హరితో లక్ష్మణయ్య వెలయ హ్లాదము హరికిన్
23.కం:సరయూ తటంత మ్రోగున్
హరినామము గంటలాగ నందరి నోటన్
పరిపరి విదాల భక్తుల్
మురియుచు హరి స్మరణజేయ మోపిరి పాదం
24:కం:భూతాలకు ప్రభుడతుడన్ 
భూ తలమందున్న పంచ భూతాల పతిన్
చేతన మొసగును రాముడు
నేతగ నిరతంబు రక్ష నీడగ నుండన్
25.కం:రామా రామా రామా 
రామా రామన్న సేవ రంజితమిచ్చున్
రామా రామంటు రమిత
రామా రమ్మంటు సామి రక్షణ గోరున్
26.కం:దశరథ నందన రాముడు
దశకంఠుని సంహరించ ధరణికి వచ్చెన్
దశ బలుడుగ పేరొందెన్
దశ నపరాధముల తృంచె ధర్మాత్ముడిగన్
27.కం:బాణంబౌ బలమైనది
ప్రాణంబుల దీయవచ్చు పాపాత్ములదిన్
మౌనుల సజ్జనులందరి
ప్రాణాలకు రక్ష రామ బాణంబిచ్చున్
28.కం:ఆజాను బాహుడటతన్
యోజనగంధా ప్రియుండు యుధ్ముడు రామా
రాజులకు రాజు, సత్యుడు
భూజానియె రాఘవుండు భూ జనులెర్గన్
29.కం:ఒక్కడు నమ్మకు తానై
మక్కువతో పెర్గె సామి మన రామయ్యన్
యెక్కడి గాలంటిందో
దిక్కైనొక్కడిని బాపి తిప్పలు తెచ్చెన్
30.కం:రక్కసి మూకలు తిరిగెటి
చిక్కని వనమందు సామి సీతతొ గడిపెన్
బుక్కెడు బువ్వా దొరకక
మిక్కిలి భోజనమదంటు మ్రింగెను దుంపల్
31.కం:ఉత్తములలొ నుత్తముడున్
మెత్తని మనసున్నవాడు మిథిలా వరుడున్
సత్తెము తప్పని వాడున్
ముత్తెములా దేహమున్న భూపుత్రి పతిన్
32.కం:రక్కసి మూకలు తిరిగెటి
చిక్కని వనమందు సామి సీతతొ గడిపెన్
బుక్కెడు బువ్వా దొరకక
మిక్కిలి భోజనమదంటు మెక్కెన్ దుంపల్
33.కం:ఎక్కడి న్యాయము రామా?
చక్కని సీతమ్మ నిడవ జంగలమందున్
నిక్కము తెల్సిన నీవే
తక్కుగ సందేహమొంద తగునా నీకు?
34.కం :వాలిని చంపన్ రామా
సాలము సాయంబు నొంద శౌర్యంబెట్లౌ ?
కాలుని శాసించగలవు 
బేలగ మారంగ నీవు వీరుండెట్లౌ?
35.కం:నిష్ఠతొ కార్యంబు సలుప
కష్టము కాదంటు రామ కథలున్ దెల్పున్
ఇష్టముగ కొల్వ రాఘవ
స్పష్టము సఫలంబు నిచ్చు సల్పగ కార్యం
36.కం:లలితా రూపము రాముని
కలతలు తొలగించు సామి కరుణా మయుడై
విలపనమంతయు బాపును
మలినము లేకుండ సేవ మనమది జేయన్
37.కం:కౌసల్యసుతుడు  రాముడు
కోసలరాజ్యాదినేత కోతుల సామిన్
దాసుల దాసుండాతను 
వాసిగ హృదినుండ భక్త వత్సలు డయ్యిన్
38కం:బంగరు లంకను గల్గియు
పొంగుతొ లంకా అధిపతి పొందె నపజయం
దొంగై హరింప సీతను 
సంగరమే జర్పె రామ చంప నసురులన్
39కం:రామా సీతా లక్ష్మణ
నేమము ఈ ముగ్గురుండ్రు నిలుచుని గుడిలో
రాముని దాసుడు హనుమా
ఏమర లేకుండ వారి యెదురుగ నుండున్
40కం:అన్నంటె రాముడేగన్
వెన్నంటుండంగనుజుల వెతలను దీర్చెన్
దన్నుగ నిలిచెను తమ్ముల
అన్నగ నాదర్శమయ్యె నన్నియు తానై
41.కం:రఘుకుల వంశజుడతడున్
సుగుణములన్నున్న రామ శూరుండతడున్
నిగమము లన్నియు నేర్చెను
సుగమములందించ జనుల శ్రుతవంతుడిగన్
42.కం:విశ్వామిత్రుని వటువై
విశ్వాంతర్యామి రామ విద్యలు నేర్చెన్
శిష్య ,గురు బంధ బలం 
విశ్వానికి తెల్య జేసె విశ్వహితుండై
43.కం:పుత్రోత్సాహ మదవ్వున్
పుత్రుడు రామయ్య పోలె  పొసగ జనులకున్
మిత్రోత్సాహమదిచ్చున్ 
మిత్రుడు రాఘవుని పోలె మెదలంగ జనుల్
44.కం:సుమధుర బానియె రాముని
అమలము హస్తములు నవ్వి అమల కరంబౌ
కమలములా కర్గు హృదిన్
సెమమది పొందిన జనులకు క్షేమంకరదిన్
45 కం:రాముని రాజ్యంబందున
క్షామంబది కానరాదు కన్నులకెపుడున్
నామము రామ జపించన్
బామును తోలాడు శక్తి పామరుడొందున్
46.కం:కైకేయమ్మ శపథమున్
సాకారంబొంద రామ సాగె నడవికిన్
కాకులు దూరని వనములొ
భీకర ప్రస్థాణమయ్యె వెంట వశ నడన్
47కం:బాలురు రామన్ లక్ష్మణ
పాలెము జేయంగ యజ్ఞ ప్రాంగణమందున్
తోలెను అడవికి ఋషులతొ
జాలిగ తండ్రగు దశరథ  శాస్త్రము నెర్పన్
48 కం:ధర్మము రక్షణ జేయన్
వర్మగ తానుద్భవించె వైదేహి పతిన్
కర్మది దుష్టుల దండన
ధర్మము న్యాయంబదంటు దాశరథెంచెన్
49 కం:సంబరపడి వనమంతయు
చుంబించెను సామి దేహ శోభను సాంతం
కంబళి తానయ్యె తలము
అంబగ రక్షించ రామ నంగము నంతన్
50 కం: ఋషులకు మునులకు ప్రియుడు, న
హుషులు కొలుచేటి దైవ హుతబుక్కాతన్
పశుపక్షాదుల ప్రియుడున్
విషముల జిమ్మేటి సర్ప ప్రీతుడు రామన్
51కం:రామా నీశరణాలను
ప్రేమగ మాకొస్గు మయ్య భీతిని బాపన్
రామ రామంటుంటన్
క్షేమంబును నిచ్చిమాకు శ్రేయము నిమ్మా
కామెంట్‌లు