“విద్యా ఎమర్జెన్సీ ప్రకటించాలి; - MV F ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట రెడ్డి ; -వెంకట్ :మొలక ప్రత్యేక ప్రతినిధి:
 తెలంగాణ రాష్ట్ర విద్యా స్థితిగతుల బాగు కోసం “విద్యా ఎమర్జెన్సీ ప్రకటించాలి:   రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని కలిసిన   MV F ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట రెడ్డి 
============================================

  ‘అభ్యసన ఫలితాల’లో  దేశంలో 35వ స్థానంలో నిలిచి తెలంగాణా రాష్ట్రం విద్యా విషయం లో చాలా  వెనుకబడి వుందని స్పీకర్ గారికి వివరించారు. ఇందు కోసం విద్యా ఎమర్జెన్సీ ప్రకటించాలని స్పీకర్ ను కోరారు.  విద్యా వ్యవస్థలో మౌలిక వసతులు కల్పించి అవసరమైన భోధన, భోదనేతర సిబ్బంది నియమించి దిగజారిన విద్యా ప్రమాణాలను మెరుగు పరచాలని నాణ్యమైన విద్యను అందించే గ్యారంటీని నూతన ప్రభుత్వం చట్టబద్ద బాధ్యతగా తీసుకోవాలని కోరారు.    రాష్ట్ర స్థాయి లో సమీక్షలు సమీకృత మార్పులు, బాలకార్మిక వ్యవస్తా నిర్మూలన, పట్టణ పెద విద్యార్థుల కు విద్యను అందుబాటులో ఉంచాలని,స్థానిక ప్రభుత్వాల బాధ్యతలను పెంచి  విద్యా వ్యవస్థను వికేంద్రీకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థల పై నియంత్రణ పెంచాలని, ఆడ పిల్లల చదువులను పి. జి వరకు ఉచితంగా అందించాలని, కేంద్రీయ విద్యాలయాల నమూనా లో అన్నీ ఉన్నత పాఠశాలలను అభివృద్ది చేయాలని కోరారు. మరో ముఖ్యమైన అంశం  గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి అయిన ప్రభుత్వ విద్య ను గాడి లో పెట్టాలంటే  విద్యకు రాష్ట్ర బడ్జెట్లో కనీసం  20 శాతం నిధులను కేటాయించాలని ప్రభుత్వానికి తెలియచేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం లో తెలంగాణ సామాజిక కార్యకర్తల వేదిక రాష్ట్ర  నాయకులు ధనసిరి ప్రకాశ్, ఇ.వెంకటేశ్ మరియు యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి , కె సంతోష్ పాల్గొన్నారు.
కామెంట్‌లు