రాజ్యాంగాన్ని గౌరవిద్దాం;- డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మిహైదరాబాద్ క్యాంప్: ఆస్టిన్( USA)చరవాణి: 9490367383
న్యాయం స్వేచ్ఛ 
సమానత్వం సౌభ్రాతృత్వం 
దేశ సమైక్యత పట్ల నిష్ఠ
సర్వ సత్తాక భారతదేశం
రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని
అవతారికలో
తమకు తాము సమర్పించుకున్న
పవిత్రమైన రోజు 
డ్రాఫ్ట్ కమిటీ అధ్యక్షుడు
బాబా సాహెబ్ అంబేద్కర్
దాదాపు మూడు ఏళ్ల కష్టం
రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు
నవంబర్ ఇరువది ఆరు పందొమ్మిది వందల నలుబది తొమ్మిది!!

సర్వ సత్తాక లౌకిక గణతంత్ర రాజ్యం మన భారతావని
రాజ్యాంగంలో ఉన్నవి 
పదునెండు   షెడ్యూళ్లు!!

ప్రభుత్వం శరీరమైతే
రాజ్యాంగం 
ఆత్మ వంటిది
ప్రభుత్వానికి దిశానిర్దేశం
చేసేదే రాజ్యాంగం!!

జనవరి ఇరవై ఆరు
పంతొమ్మిది వందల యాభై
రాజ్యాంగం అమలైన రోజు
సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా 

భారతదేశం అవతరించిన రోజు!!

ప్రపంచంలోనే
అతిపెద్ద లిఖిత రాజ్యాంగం
భారతదేశ రాజ్యాంగం!!

రాజ్యాంగాన్ని గౌరవిద్దాం
చట్టాలు  ఎవరికీ చుట్టాలు కావని చాటుదాం
జై భారత్!!
-----------------

కామెంట్‌లు