సహాయం;- యస్. రేణుక- ఎనిమిదవ తరగతి- ZPHS హవేలీ ఘనపూర్- మెదక్ జిల్లా- 6302411016

      అనగనగా నాగపూర్ అనే గ్రామంలో సింధు, అక్షయ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరికీ చదువుకోవడం అంటే చాలా ఇష్టం గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉండడం మూలంగా పై చదువులకు వాళ్ళు పదవ తరగతి చదవడం కోసం పొరుగు గ్రామం రామయంపేటకు వెళ్లేవారు. అలా వారు వెళుతున్న సమయంలో దారిలో కొన్ని జంతువులు ఆకలికి చనిపోయేవి. ఒకరోజు వాళ్ల ముందు ఒక పక్షి అలమటిస్తూ కొట్టుకొని చనిపోయేవి.
                ఇద్దరు మనసు చాలా కలత చెందింది. ఎలాగైనా ఈ సమస్య పరిష్కారం కావాలని చాలామందికి చెప్పారు.  కానీ ఎవరూ పట్టించుకోపోయేసరికి సింధు, అక్షయ లు మాత్రం ఎలాగైనా పక్షులను రక్షించాలని పట్టుదలతో ఉన్నారు. ఇద్దరు కూడా ప్రతిరోజు దారిలో ఒక మొక్క నాటుతూ పాఠశాలలో మిగిలిన ఆహారం వెళ్ళేటప్పుడు దారిలో పక్షులకు వేసేవారు. అలా చేయడం మూలంగా కొద్ది రోజుల్లో పక్షులు చనిపోవడం మార్పు జరిగింది. 
            సింధు, అక్షయలు అలా భోజనం పక్షులకు వేయడం చెట్లు నాటడం మొదట ప్రజలు వ్యతిరేకించిన నెమ్మదిగా వారి మనసును తెలుసుకున్నారు. ఈ విషయం సర్పంచ్ చంద్రయ్య తెలుసుకొని వందల కొద్ది చెట్లు నాటించి ప్రతిరోజు పక్షులకు కొంత ఆహారం వేయించేవాడు. బాగా కురిసిన వర్షానికి చెట్లు పెద్దగాయి కాయలు, పండ్లు ఉండడం మూలంగా పక్షులు వాటిని తిని జీవించసాగాయి. పెద్దగై మంచి ఉద్యోగాల్లో ఉన్న సింధు, అక్షయలు తమ గ్రామం వెళ్ళినప్పుడు దారిలో ఉన్న చెట్లను చూసి సంబరపడేవారు. వారు కూడా అప్పుడప్పుడు చెట్టు నాటుతూ స్ఫూర్తిగా నిలిచేవారు. 
కామెంట్‌లు