నీటి వృధా;- కృష్ణవేణి- ఎనిమిదవ తరగతి- ZPHS హవేలీ ఘనపూర్- మెదక్ జిల్లా- 6302411016
 అనగనగా రాంపూర్ అనే ఊరిలో రాజయ్య, రాధమ్మ అనే దంపతులకు ప్రశాంత్ అనే కుమారుడు ఉండేవాడు. ప్రశాంత్ పదవ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడం ప్రశాంత్ పాఠశాలకు వెళ్లడం మూలంగా మధ్యాహ్నం వేళల్లో నల్ల నీళ్లు వృధాగా కింద పోసాగాయి. ప్రశాంత్ తల్లిదండ్రులకు నల్ల నీళ్లు వృధాగా పోతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. కానీ ప్రతిసారి నల్ల నీళ్లు మాత్రం కిందనే పోతున్నాయి. నీళ్లు కింద పోవడం మూలంగా పక్కింటి వాళ్ళతో గొడవలైన పరిష్కారం మాత్రం లభించలేదు.
            పాఠశాలలో నీళ్లు వృధా చేయొద్దు అన్న విషయం ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్న ప్రశాంత్ ఎలాగైనా తన ఇంటి నీళ్ల సమస్యను పరిష్కరించుకోవాలని అనుకున్నాడు. ప్రశాంత్ ఒకరోజు సర్పంచ్ మల్లయ్య మామ కలిసి విషయం చెప్పాడు. సర్పంచ్ మల్లయ్య ప్రశాంత్ పట్టుదలకు మెచ్చుకొని, ఒక పథకం చెప్పాడు. ఆరోజు సాయంత్రం ఎవరికీ తెలియకుండా ప్రశాంత్ మధ్యలో నల్లా కలెక్షన్ మూసివేశారు. ఇప్పుడు ప్రశాంత్ ఇంట్లోకి నల్ల నీళ్లు రావడం లేదు. రాధమ్మ, రాజయ్యలు నీళ్లులేక తీవ్ర ఇబ్బందులు పడుతూ సర్పంచ్ మల్లయ్య వద్దకు వెళ్లి నీళ్లు రావడంలేదని అడిగారు. నీళ్లు వస్తే వృధాగా పోతున్నాయి కదా మీ ఇంటికి నీళ్లు ఎందుకు అని మల్లయ్య అన్నాడు. ఇద్దరు తమ తప్పును తెలుసుకున్నారు. తల్లిదండ్రులు తప్పు తెలుసుకున్న విషయం గ్రహించిన ప్రశాంత్ మళ్లీ యధావిధిగా నీటి కలెక్షన్ ఇచ్చాడు. రాజయ్య, రాధమ్మలు అవసరమైన నీళ్లు తీసుకున్నాక మిగిలిన నీళ్లు వృధా పోకుండా గేట్ వాల్ బిగించారు. ప్రశాంత్ నల్ల నీటి సమస్య తీరినందుకు సంతోషంగా ఉంటూ పట్టుదలతో ఉంటే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని దృఢంగా నిర్ణయించుకున్నాడు.


కామెంట్‌లు