బుజ్జి కుక్కపిల్ల;- అదీభా-ఆరవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9849505014
   అనగనగా సీతాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో సంధ్య, సురేష్ అనే ఇద్దరు దంపతులు నివసించేవారు. వారికి విజయ్ అనే కుమారుడు దీపిక అనే కుమార్తె ఉన్నారు. సంధ్య, సురేష్ కుటుంబం ఒక పూరి గుడిసెలో నివసిస్తూ, వ్యవసాయం చేస్తూ జీవించేవారు. విజయ్, దీపికలు బడికి వెళ్లి చదువుకునేవారు. ఒకరోజు బుజ్జి కుక్కపిల్లను బడి నుంచి వచ్చేటప్పుడు విజయ్, దీపికలు తీసుకువచ్చి ఆడుకున్నారు. కొద్దిసేపటికి వారిద్దరు ఇంట్లోకి వెళ్లి వచ్చేలోగా బుజ్జి కుక్కపిల్ల కనిపించడం లేదు. విజయ్, దీపికలు కుక్కపిల్ల కోసం తిరగసాగారు.
               వారిద్దరూ తిరగగా తిరగగా ఒక చిన్న బావిలో బుజ్జి కుక్కపిల్ల పడిపోయి అరుస్తుంది. విజయ్, దీపికలకు కండ్ల నుండి నీళ్లు కారసాగాయి. అంతలోనే అక్కడికి వచ్చిన సంధ్య, సురేష్ లు ఆ చిన్న బావిలోకి నిచ్చెన వేసి దిగి, బుజ్జి కుక్కపిల్లను కాపాడారు. బావినుంచి పైకి వచ్చిన బుజ్జి కుక్కపిల్లను చూడగానే విజయ్, దీపికలు చాలా సంతోషించారు. అందరూ కలిసి బుజ్జి కుక్కపిల్లను తమతో ఇంటికి తీసుకువెళ్లి పెంచుకోసాగారు. ఎలాంటి క్రిమి కీటకాలు వారి ఇంటిలోకి రాకుండా బుజ్జి కుక్కపిల్ల కాపాడసాగింది.

కామెంట్‌లు