శరణాగతి తత్వం; సి.హెచ్.ప్రతాప్

 ఎప్పుడయితే తన భక్తుడు తననే నమ్ముకుని ఉన్నాడని భగవంతునికి కుదురుతుందో అప్పుడే ఆయన తన భక్తులను కాపాడటానికి వస్తాడు.రామాయణంలో కూడా సుగ్రీవుడు మొదట తన భుజ బలాన్ని నమ్ముకున్నాడు, వాలి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. అనంతరం శ్రీ రాముడికి పూర్తిగా సరణాగతి చేసాకే జరిగి వాలి వధ జరిగింది. అనేక మంది భక్తుల చరిత్రలు పరిశీలించినపుడు కూడా వారు సర్వస్వ శరణాగతి చేసినపుడు భగవంతుడు వారిని కరుణించడం మనకు అర్ధమవుతున్నది.గజేంద్రమోక్షంలో ఏనుగుని రక్షించినపుడు రామదాసుని తానీషా చెర నుండి విడిపించేటపుడు భగవంతుడు వారిని కరుణించడం అనే దానికి కారణం ఈ సర్వస్వ శరణాగతే.కేవలం భుక్తి కోసం, ధనార్జన కోసం, ప్రాపంచిక విద్య కోసం ఎంతో కాలాన్ని, శక్తిని వినియోగించాల్సి వస్తే.. నిత్య సత్యమైన, ఈ సకల జగత్తుకు అధిపతియైున, చరాచర సృష్టికి మూల కారణమైన ఆ భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఎంత సాధన కావాలో అర్థం చేసుకోవచ్చు. ఈ సాధన ఎంత కాలం కొనసాగాలంటే..? మనలో స్థిరత్వం, భగవంతుడి పట్ల అచంచలమైన పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, తుదకు శరణాగతి తత్వం అలవరచుకునేంత వరకు.ఇతర వ్యర్ధమైన ఆలోచనలు కట్టిపెట్టి భగవంతుని యందే మనస్సు పూర్తిగా లగ్నం చేయాలి. ఇందుకు ధ్యానం, ప్రాణాయామం, యోగా భ్యాసం ఎంతగానో ఉపకరిస్తాయి. మనస్సులో వ్యర్ధమైన ఆలో చనలు ప్రవేశించినప్పుడల్లా భగవంతుని నామం స్మరించడం లేదా మనకు ఇష్టమైన దేవతా రూపాన్ని ఉపాసన చేయడం అల వాటు చేసుకుంటే, ఈ సాధన ద్వారా వచ్చే ఆధ్యాత్మిక శక్తికి చెడు ఆలోచనలు దూరంగా పారిపోవడం ఖాయం. మనం చేసే కర్మలన్నింటినీ ఫలితం ఆశించకుండా భగ వంతునికే సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని అర్పించాలి. అను క్షణం భగవంతుని కరుణ కోసం, ఆయనను సంతృప్తి పరచ డమే మన లక్ష్యం కావాలి. భగవంతుని ప్రియం చేకూర్చడమే లక్ష్యం అయినప్పుడు ఎటువంటి త్యాగాలకైనా మానసికంగా సిద్ధం కావాలి.
కష్టనష్టాలు ఎదురైనప్పుడు ఎటువంటి సంశయాలకు తావివ్వక, సంపూర్ణ శరణాగతి భావంతో ప్రార్థన మార్గం ద్వారా భగవంతుడినే శరణు వేడుకోవడం అత్యుత్తమం.అయ్యో, ప్రజలారా, వారి శరీర వాక్కు మరియు మనస్సుతో ఇతర ప్రాపంచిక విషయాలను వెంబడిస్తారు. ఇది, నిజంగా దయనీయమైనది. అయితే, మీ భక్తులమైన మేము, గురువాయూర్ ప్రభువా, విశ్వంలోని అన్ని జీవుల యొక్క మొత్తం ఆత్మ యొక్క స్వరూపుడు, అన్ని ప్రాపంచిక బాధల నిర్మూలన కోసం పూర్తిగా స్థిరమైన మనస్సులతో మీకు శరణాగతి చేస్తాము ని నారాయణీయం కావ్యం ద్వారా సాధకులకు మన ఆధ్యాత్మిక వేత్తలు ఒక చక్కని సాధనామార్గం తెలియపరిచారు. యోగులు తమ హృదయాలలో భగవంతుని ధ్యానిస్తారు - పరమాత్మ - వారి అంతిమ సాక్షాత్కారం వారి హృదయాలలో పరమాత్మగా పరమాత్మ యొక్క వ్యక్తిగత రూపం. దురదృష్టవశాత్తూ యోగులు సాధారణంగా యోగా-సిద్ధిలు , యోగ పరిపూర్ణతలతో పరధ్యానంలో ఉంటారు . ఈ మార్మిక పరిపూర్ణతలు యోగులు భౌతిక ప్రపంచంలో అద్భుతమైన శక్తులను సాధించేలా చేస్తాయి-కాని యోగ యొక్క నిజమైన పరిపూర్ణత ఏమిటంటే, హృదయంలో ఉన్న పరమేశ్వరుడిని గ్రహించి, ఆయనకు శరణాగతి చేసి, ఆయనకు సేవ చేయడమే-కాబట్టి పరిపూర్ణ యోగి వ్యక్తిగా, భక్తుడిగా మారతాడు.  
కామెంట్‌లు