"ధ1 సంజయుడు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ధృతరాష్ట్రుడు చాలా తెలివిగా సంజయుని రాయబారిగా పాండవుల దగ్గరకు పంపాడు.చాలా విశ్వాసం ఉన్న మంత్రిగా ఆస్వార్ధ రాజుని చివరికంటా వెన్నంటి ఉంటాడు.కౌరవుల దుర్మార్గం తెల్సినా ఏమీ అనకుండా స్వామి భక్తి చూపాడు.తన ఉద్యోగం ని విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చాడు.యుద్ధంలో కొడుకులంతా చనిపోయాక ధృతరాష్ట్రుడు అతనితో
అడవికి వెళ్ళాడు.ఆయన చనిపోయాక తపోభూమి కి వెళ్లిన సంజయుని వాక్పటుత్వం గొప్పది.కబోది రాజుకి దుర్యోధనుడు అంటే పిచ్చి ప్రేమ.పైగా పాండవులకి రాజ్యం ఇవ్వడం ఇష్టం లేదు.భిక్షాటనతో బ్రతకమని సలహా ఇస్తాడు.సంజయుడు తు.చ.తప్పకుండా అతని మాటల్ని లౌక్యంగా అప్పజెప్పాడు.దానికి ధర్మరాజు
దీటుగా జవాబు ఇలా ఇచ్చాడు.3 " సంజయా! మా పెద్ద నాన్న ఎంత కపటం స్వార్థం తో మాట్లాడాడు? బాల్యం నుంచి కష్టాలు నష్టాలు అనుభవిస్తూనే ఉన్న మమ్మల్ని ఇంకా బిక్షాటన తో బతకమనటం భావ్యమా? అసలు తండ్రి వల్లనే కదా దుర్యోధనుడు పాడైంది.మాకు రాజ్యం ఇవ్వడు.యుద్ధం వద్దు అంటాడా? తప్పంతా నామీదే నెడ్తాడా? మాసంగతి తెలిసీ నీవు ఇలా మాట్లాడితే ఎలా?" అని నిర్మొహమాటంగా అడిగాడు.అలా సంజయుని రాయబారం విఫలమైంది. కానీ సంజయుడు భారతంలో నిలిచిపోయాడు...
కామెంట్‌లు