విడదీయబడనిది బంధం అది రక్తసంబంధం కావచ్చు సాన్నిహిత్యంతో మరి కొంతమందిని కలువవచ్చు దీనిని విడదీయలేము అంటున్నారు పెద్దలు. నవ మాసాలు మోసి కానీ పెద్ద చేసిన తల్లి నీకు ఉద్యోగం చూడడానికి అన్ని విధాల ఎంతో కష్టపడి నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన తండ్రి నీకు సన్నిహితంగా ఉండి నీ మంచి చెడ్డలను చూసే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల బంధాలు శాశ్వతంగా ఉండేవి కావు దానిలో ఎవరి బంధాన్ని వదులుకుంటావు నిజానికి ఆడపిల్ల వివాహం కాగానే అత్తవారింటికి వెళ్ళిపోతుంది ఆ క్షణంతో పుట్టింటి బంధం సంబంధం తెగిపోతుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ అక్కడికి వెళ్లిన ఆడపిల్లకు తెలుసు ఆ మనసు. అనుక్షణం పుట్టింట్లో గడిపిన ప్రతిక్షణం ఆమె స్మృతి పథంలో మెదులుతూనే ఉంటుంది అమ్మను మర్చిపోవడం సాధ్యమవుతుందా ప్రతి చిన్న పనిలో ఆమె కథ జ్ఞాపకం రావడం తనకు బుద్ధులు చెప్పిన అన్నలు నాన్నలు మరవడం అంత తేలికా పుట్టిన ఇంట ఏ కొంచెం ఇబ్బంది కలిగిన మరుక్షణంలో వాలిపోయేది అమ్మాయే తప్ప అబ్బాయి కాదు కదా ఆడపిల్లలకు ఉన్న ఆత్మీయత మగ పిల్లలకు ఉంటుందా అంటే సందేహమే తన రక్తంలో ఆ బంధం జీర్ణించుకు పోయింది దానిని మార్చడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు అమ్మకు ఏ క్షణంలో ఏ ఇబ్బంది కలిగిన మరుక్షణం లో ఆమె ఈ ఇంటి ముంగిట వాలిపోతుంది కదా అంతకుమించిన ఆర్థిక బంధం మరొకటి ఉంటుందా ఈ ప్రపంచంలో అందుకే దానిని విడదీయలేని బంధము అన్నారు. చంటి కుర్రవాడి నుంచి ముసలి తాత వరకు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటే గొప్ప అనుభూతి కడగడం సహజం ఆ జరిగిన సంఘటనలు కొన్ని ఆనందాన్ని కలిగించవచ్చు మరి కొన్ని బాధను కలిగించవచ్చు మరికొన్ని చెప్పుకోవడానికి వీలు లేనంత రహస్యంగా జరిగి ఉండవచ్చు మనసులో ఇవన్నీ ఒక్కసారి వచ్చినప్పుడు అతని తత్వం ఎలా ఉంటుంది ఏకాంతంగా ఉన్న కన్నీరు రావడం కానీ ఆనందంతో కంటి నుంచి నీటి ధార రావటం కానీ సహజం కనుకనే ఈ జీవితం లో ఏదీ శాశ్వతం కానిదే. అవన్నీ క్షణిక ఆనందాలే తప్ప కావు అన్న విషయం తెలిస్తే జీవితం ఆనందమయం అవుతుంది అని వేదాంతం మనకు చెప్పే పాఠం.
బంధాలు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి