విద్యా బోధన;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పేదవాడు కొత్త పుస్తకాలు కొన గలిగిన స్తోమత  లేనివారు  పాత పుస్తకాలతోనే కాలం  వెళ్లబుచ్చుతూ ఉంటారు  పాత పుస్తకం కనుక ఏ పేజీ ఎప్పుడు చిరిగిపోతుందోనన్న  దృష్టితో ఎంతో జాగ్రత్తగా పేజీలను తిప్పేటప్పుడు కూడా  భద్రంగా ఉండేలా ఉంటాడు  అదే డబ్బున్న వాడు  తన ఇష్టం వచ్చినట్లు పుస్తకాన్ని ఉంచి  అటు ఇటు ఆ పేజీలు తిప్పుతూ  నలిగిపోయేలా చిరిగిపోయేలా ప్రవర్తిస్తూ ఉంటాడు  అతని చీమ ఏ క్షణాల ఆ పుస్తకం చిరిగిపోతే మరొక కొత్త పుస్తకం క్షణాల్లో తీసుకొని రా గలిగిన సేవకుడు తన ప్రక్కనే ఉంటారు  దీనితో అతనికి అహంకారం తిరిగి  జీవితంలో ఎలాంటి  దుష్పరిణామాలకు గురి అవుతూ ఉంటారో  సమాజంలో కొంతమందిని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది  భద్రంగా ఉన్న వాడికి లేని వాడికి తేడా  గమనించినట్లయితే సమాజానికి ఎవరు ఎక్కువగా ఉపయోగపడతారో మనకు  తెలిసి వస్తుంది. పిల్లలకు ఉపాధ్యాయుడి గాని తల్లిదండ్రులు గాని నేర్పవలసిన  పద్ధతి ఒకటి ఉంది  వాడు ఏ పని చేస్తున్నా ఆ పనిపై మనసు పెట్టి అంకిత భావంతో చేసేలా చూసినట్లయితే  వారు చేసే ప్రతి పనిలో వాడు విజయాన్ని సాధిస్తారు  పుస్తకం ముందు పెట్టుకుని పేజీలు తిప్పుతూ చదివినట్టుగా నటించిన వారికి పాఠం వస్తుందా  అలా కాకుండా ఉన్న ఒక పేరాను చదివి  దానిని అర్థం చేసుకొని మరొకసారి చదివినట్లయితే  మనసుకు పడుతుంది  అప్పట్లో గురుకులాలలో కూడా గురువుగారు పాఠం చెప్పినప్పుడు  శిష్యులలో ఏకసంధాగ్రాహులు ద్విసంధా గ్రహులు,  త్రి సంధా గ్రహులు ఉంటాడు  ఒకసారి చెప్పగానే ఆ కుర్రవాడికి వస్తుంది  రెండుసార్లు చెప్పితే  కుర్రవాడికి వస్తుంది మూడు సార్లు చెప్పితే మూడవ వస్తుంది  కానీ చివరకు ఎన్నిసార్లు చెప్పినా అతనికి  రాదు. అలాంటి పరిస్థితుల్లో  గురువుగారు  రంగ ప్రవేశం చేసి ఆ  మందమరపు వ్యక్తిని  తన సాధ్యం చేసుకొని  అతనికి ఏ పద్ధతిలో చెబితే గ్రహించగలడో ఆ పద్ధతిని వెతికి  దాని ద్వారా విద్యా బోధ చేస్తూ ఉంటాడు. ఏ గ్రామంలోనైనా  అక్షరాభ్యాసం చేసిన పిల్లలకు అక్షరాలు నేర్పే  గురువు  పలక బలపం తీసుకొని ఆ అక్షరాన్ని పాటికి 10 సార్లు వ్రాయించి  అది చూడకుండా కూడా వ్రాయగలిగిన స్థితి వచ్చేలా చేస్తూ ఉంటాడు  ఆ గ్రహించగలిగిన విద్యార్థులలో కూడా  కొంతమంది వెంటనే చేయగలుగుతూ ఉంటారు మరి కొంత మందికి చాలా ఆలస్యంగా చేసే అలవాటు ఉంటుంది  అప్పుడు గురువుగారు  ఆ లౌక్యాన్ని తెలియజేసి  ఇలా చేస్తే ఎలా జ్ఞాపకం ఉంటుంది  అలా సాధన చేయండి అని మూల సూత్రాలను తెలియజేస్తూ ఉంటాడు  అప్పుడు పద్ధతి తెలిసిన  బాలురు దానిని అనుసరిస్తూ  గురువుగారు చెప్పినట్లుగా చేస్తూ ఉంటారు.


కామెంట్‌లు