దండోపాయాలు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.-6302811961.
 దండం దశ గుణ  భవేత్  అన్నది సూక్తి  సామ దాన పేద దండోపాయాలు అని నాలుగు పద్ధతులను తెలియజేస్తారు మన పెద్దలు  సామ పద్ధతిలో  ఎంతో సహనంతో ఇలా చేయి అలా చేయి అని చెబుతూ ఉంటారు  మరి కొంతమందికి అరే నువ్వు ఈ అక్షరాలు నేర్చుకుంటే ఈ జీవ పదార్థాలు చాక్లెట్లు గాని మిగిలినవి కానీ ఇవ్వడానికి ఆశ చూపుతారు  దానినే దాన పద్ధతి అంటారు. భేద పద్ధతిలో ఎదుటివారిని ఉదాహరణగా చెబుతూ చూశావా రామునీ కన్నా చాలా బాగా ముందుకెలుతున్నాడు మరి వాడికన్నా నువ్వు ఎక్కువ తెలివిగలిగినవాడు కదా వాడికన్నా ముందుకు వెళ్లాలిగా అలా చేయి అని  అతనిలో ఉన్న తత్వాన్ని పైకి  తీసుకువచ్చేవాడు మాత్రమే గురువు  ఈ మూడు పద్ధతులకు కూడా లొంగని విద్యార్థులు ఉన్నట్లయితే చివరిగా  దండం ప్రయోగిస్తాడు  అప్పుడు భయంతో అతను  సరైన సక్రమ మార్గంలో ప్రవర్తిస్తాడు  అందుకే ఈ వాక్యాన్ని ప్రయోగిస్తూ ఉంటాడు. గురువుగారు పిల్లలను కోపగించుకున్న  వారిని కొట్టిన  ఆ తెల్లవారి తండ్రి వచ్చి మేము మా కుర్రవాడిని ఎంతో గారాభంగా పెంచుతున్నాం  మీరలా కొడితే ముదిరిపోతాడు. ఎవరి మాట లెక్క చేయడు వాడికి చదువు రాకపోయినా పరవాలేదు  కొట్టకండి తిట్టకండి అని చెప్పి  వెళతారు అలా చేయడం వల్ల ఆ కుర్రవాడికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది ఆలోచించరు పెద్దలు  మరి కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు  తండ్రి  పేను  బెత్తం  తీసుకువచ్చి ఉపాధ్యాయునికి ఇచ్చి  మావాడు సరిగా చదవకపోతే వీపు చేరి వేయండి దయా దాక్షిన్యాలను చూయించవలసిన అవసరం లేదు  వాడికి చదువు రావడం ముఖ్యం  మీ ఇష్టం వచ్చినదండన విధించండి  ఉత్తమ విద్యార్థిగా చేయడమే మీ పనిగా  గుర్తించండి అని చెప్పేవారు  లేకపోలేదు.
భారతదేశంలో ఉన్న భాషలన్నిటిలోకి ఆంధ్ర భాషకు విలువ మరి ఏ భాషకు లేదు అని చెబితే అది శోత్కర్ష అవుతుంది తప్ప పొగడ్త కాదు అనుకుంటున్న పరిణతి చెందిన పరిపూర్ణ భాష  నా భాష అని ప్రతి ఆంధ్రుడు తల ఎత్తి చెప్పుకోవాలన్న  మాట  ఈ ప్రపంచంలో,  ప్రపంచము అంటే  అందరికీ తెలిసిన మాట  వరల్డ్  రా అంటే అతి పెద్దదైన  పంచం అంటే పంచభూతములతో ఏర్పడినది  శరీరము అనర్థం ఒక్క ఆంధ్ర భాషలోనే ఉన్నది అని గమనించాలి  ఇలా ఏ పదాన్ని స్వీకరించినా దానిలో అర్థం ఏమిటి అన్నది స్పష్టం  ఉదాహరణకు తల్లి గర్భంలో తొమ్మిది నెలలు  ఉండి ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ప్రాణి అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వ్యష్టిగా పరిగణించబడతారు వీడికి పెద్దవారై వివాహమైన తర్వాత భార్యాభర్తలు కలిస్తే వ్యక్తి  అలాంటి కుటుంబాలతో కూడింది సమాజం దీనిని సమష్టి అంటాం.


కామెంట్‌లు